Today Gold Rates : మరికాస్త తగ్గిన బంగారం ధర.. వెండి ధర పరుగు!

నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఈరోజు కాస్త తగ్గాయి. మార్కెట్ స్టార్ట్ అయ్యేటప్పటికి తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర 22 క్యారెట్లు 10 గ్రాములు ₹ 66,770, 24 క్యారెట్లు 10 గ్రాములు ₹ 72,840గా ఉంది. కేజీ వెండి కొద్దిగా పెరిగి ₹ 91,000 గా ఉంది.

New Update
Today Gold Rates

ఈరోజు బంగారం ధరలు కాస్త తగ్గాయి. నిజానికి ఇటీవల కాలంలో బంగారం ధరలు కిందికే కదులుతున్నాయి. ఈనెలలో ఇప్పటివరకూ పది గ్రాముల బంగారం ధర 750 రూపాయలకు పైగా తగ్గింది. మధ్యలో ఒక్కరోజు మాత్రమే 550 రూపాయల వరకూ పెరుగుదల నమోదు చేసినా తరువాత మళ్ళీ తగ్గుతూనే వస్తోంది బంగారం ధర. ఇక వెండి ధరలు మాత్రం అటూ.. ఇటూ కదులుతున్నాయి. నిన్న కేజీకి 500 రూపాయలు పెరిగిన వెండి ధర ఈరోజు ఏకంగా 1000 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. మొత్తంగా చూసుకుంటే ఈరోజు అంటే సెప్టెంబర్ 11న బంగారం ధరలు మరికాస్త కిందికి దిగివచ్చి  గోల్డ్ లవర్స్ కి సంతోషాన్నిచ్చాయని చెప్పవచ్చు.  ఇక ఈరోజు ఉదయానికి అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు పెరుగుదలతో  ట్రేడ్ అవుతున్నాయి.   ఈ నేపథ్యంలో ఆప్రభావం మన మార్కెట్లపై కూడా కనిపించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. దీంతో ఈరోజు మార్కెట్ ముగిసే సరికి బంగారం, వెండి ధరలు (Silver Price) కాస్త పెరుగుదల నమోదు చేయవచ్చని అంచనా వేస్తున్నారు. 

Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం కొద్దిపాటి తగ్గుదల అంటే 30 రూపాయలు తగ్గింది. అలాగే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర కూడా 30 రూపాయలు తగ్గింది. ఇక దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లోనూ ఈరోజు బంగారం ధరలు ఇదే ధోరణిలో ఉన్నాయి. అక్కడా  22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 30 రూపాయల స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి. మరోవైపు దేశవ్యాప్తంగా వెండి ధరలు పెరుగుదల నమోదు చేశాయి. కేజీకి 1000  రూపాయలు వెండి ధరలు పెరిగాయి.  

ఈరోజు హైదరాబాద్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి 

22 క్యారెట్లు 10 గ్రాములకు ₹ 66,770

24 క్యారెట్లు 10 గ్రాములకు ₹ 72,840

ఇక విజయవాడ ,  విశాఖపట్నం , తిరుపతి లలోనూ బంగారం ధరలు తగ్గుదల   కనబరిచాయి. ఆ ప్రాంతాల్లో ఈరోజు మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం ధరలు ఇలా ఉన్నాయి .  

22 క్యారెట్లు 10 గ్రాములకు ₹ 66,770

24 క్యారెట్లు 10 గ్రాములకు ₹ 72,840

దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు దిగివచ్చాయి.  ఈరోజు తగ్గుదల కనబరిచిన బంగారం ధరలు కింది విధంగా ఉన్నాయి. 

10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ₹ 66,910

10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ₹ 72,990

Gold Price Today: బంగారం ధరలు తగ్గుదల బాటలో నడిస్తే, మరోవైపు వెండి ధరలు మాత్రం పెరుగుదల కనబరిచాయి. హైదరాబాద్ లోనూ ,  ఢిల్లీలోనూ కూడా వెండి ధరలు భారీగా పెరిగాయి. 

హైదరాబాద్ లో వెండి ధర కేజీకి.. ₹ 91,000 గానూ ,  ఢిల్లీలో వెండి ధర కేజీకి ₹ 86,000 గానూ ఈరోజు మార్కెట్ ప్రారంభ సమయానికి ఉన్నాయి .  

ఇక అంతర్జాతీయంగా బంగారం ధరల్లో పెరుగుదల  కనిపిస్తోంది.   ఈరోజు అంటే సెప్టెంబర్ 11 ఉదయం 6 గంటల సమయానికి అంతర్జాతీయంగా బంగారం ధరలు ఔన్సు 2,516.36 డాలర్ల వద్ద ఉన్నాయి.  అలాగే వెండి ధరలు ఒక్కసారే పెరిగాయి. దీంతో కేజీకి 912.40 డాలర్లకు దగ్గరలో ట్రేడ్ అవుతున్నాయి.

Also Read :  క్రూడ్ ఆయిల్ ధర మారలేదు.. పెట్రోల్ రేట్ అలానే ఉంది

Advertisment
తాజా కథనాలు