Gold Prices: రూ. 80 వేలకు చేరువలో తులం బంగారం...!

బంగారం ధరలు గురువారం మళ్లీ కాస్త పెరిగాయి. వెండి ధరలు తగ్గాయి. తులం బంగారం 80 వేలకు చేరువలో ఉంది. కేజీ వెండి 92 వేల వద్ద కొనసాగుతుంది. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ.1,01,100 గా ఉంది.

gold6
New Update

Gold Price: దేశంలో బంగారం ధరలు గురువారం స్వల్పంగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 70,610 కి చేరుకుంది. 
బుధవారం ఈ ధరలు రూ. 70,600గా ఉన్నాయి. ఇక 100 గ్రాముల 22క్యారెట్లు  బంగారం ధర రూ. 100 పెరిగి రూ. 7,06,100గా కొనసాగుతుంది. 1 గ్రామ్​ గోల్డ్​ ప్రస్తుతం 7,061గా ఉంది. మరోవైపు 24 క్యారెట్ల బంగారం 10గ్రాములు  ధర సైతం రూ.10 పెరిగింది. దీంతో ధర రూ. 77,030గా కొనసాగుతోంది. క్రితం రోజు ఈ ధర రూ. 77,020గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల 24క్యారెట్లు పసిడి ధర రూ. 100 పెరిగి రూ. 7,70,300గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 7,703గా కొనసాగుతుంది.

దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు గురువారం పైకి ఎగబాకాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి ధర రూ. 70,760గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 77,180గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 70,610 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 77,030గా ఉంది. ముంబై, పుణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 70,610గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ.77,030గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 70,610గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 77,030గాను ఉంది.

హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ.70,610గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 77,030గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే ఉన్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి. 

వెండి ధరలు ఇలా..

దేశంలో వెండి ధరలు గురువారం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం 100 గ్రాముల వెండి ధర రూ. 9270గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 తగ్గి రూ. 92,700గా కొనసాగుతోంది. బుధవారం ఈ ధర రూ. 92,800గా ఉంది. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ.1,01,100 గా కొనసాగుతుంది.

#gold-rate #gold-prices #gold-rate-today
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe