TATA : స్టాక్ మార్కెట్‌లో రతన్ టాటాకు గౌరవం..15% పెరిగిన టాటా షేర్లు

రతన్ టాటా మరణం అందరినీ కలిచి వేసింది. స్టాక్ మార్కెట్ సైతం ఆయన మృతికి ఘన నివాళి సమర్పించింది. అందుకు గుర్తుగా టాటా షేర్లు ఈరోజు 15శాతం పెరిగాయి. టాటా గ్రూప్ నుంచి దాదాపు 25కు పైగా లిస్టెడ్ కంపెనీలు ఉన్నాయి. 

author-image
By Manogna alamuru
shares
New Update

TATA Shares: 

అతి పెద్ద పారిశ్రీమిక వేత్త రతన్ టాటా నిన్న అర్థరాత్రి ముంబైలో అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల దేశం యావత్ సంతాపం తెలియజేస్తోంది. మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో సంతాపదినాలు కూడా ప్రకటించారు. యూరోపియన్ ఎయిర్‌క్రాఫ్ట్ తయారీ దిగ్గజం ఎయిర్‌బస్ ఈరోజు రతన్ టాటా మృతి కారణంగా..ఆయనకు గౌరవం ఇస్తూ దక్షిణాసియాలో తన కొత్త ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించడాన్ని రద్దు చేసింది. ఇక స్టాక్ మార్కెట్‌లో టాటా గ్రూప్ షేర్లు 15 శాతం పెరిగాయి. టాటా గ్రూప్ నుంచి టీసీఎస్ వరకూ అన్ని షేర్లూ హైక్ అయ్యాయి. మార్కెట్ క్యాప్ పరంగా దేశంలో అత్యంత విలువైన కంపెనీ. దీని జాబితా 2004లో జరిగింది. టాటా మార్కెట్ క్యాప్ విలువ దాదాపు రూ.15,43,114.33 కోట్లు. ఇందులో టాటా మోటార్స్, టైటాన్, టాటా స్టీల్, ట్రెంట్, టాటా పవర్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, ఇండియన్ హోటల్స్, టాటా కమ్యూనికేషన్స్, వోల్టాస్, టాటా ఎల్క్సీ ప్రధాన కంపెనీలుగా ఉన్నాయి. వీటిలో చాలా కంపెనీల షేర్లు పెరిగాయి. 

బీఎస్‌ఈలో టీసీఎస్ షేర్లు 0.22% లాభంతో రూ.4261.50 వద్ద ట్రేడయ్యాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి రూ.4290.20కి చేరుకుంది. దీని 52 వారాల గరిష్టం రూ.4,585.90. టాటా మోటార్స్ షేర్లు 0.35% క్షీణించి రూ.935.85 వద్ద ఉన్నాయి. టైటాన్ షేర్లు రూ.3494.00 వద్ద స్థిరంగా ఉన్నాయి. టాటా స్టీల్ షేర్లు 1.01% పెరిగి రూ.160.60 వద్ద ఉన్నాయి. టాటా గ్రూప్ రిటైల్ కంపెనీ ట్రెంట్ షేర్లు 1.75% క్షీణతతో రూ.8076.25 దగ్గర ట్రేడవుతున్నాయి. రతన్ టాటా సోదరుడు నోయెల్ టాటా ఈ కంపెనీకి ఛైర్మన్‌గా ఉన్నారు. టాటా పవర్ షేర్లు 2.36 శాతం వృద్ధితో రూ.471.80 వద్ద ట్రేడయ్యాయి. పునరుత్పాదక ఇంధనంలో టాటా పవర్ పెద్ద పందెం ఆడేందుకు సిద్ధమవుతోంది. ఒక నివేదిక ప్రకారం.. కంపెనీ రాబోయే ఆరేళ్లలో దాదాపు రూ.75,000 కోట్ల పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేసింది. టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ షేర్లు 0.26% పెరుగుదలతో రూ.1121.05 వద్ద ట్రేడవుతుండగా, టాటా కమ్యూనికేషన్స్ షేర్లు 0.79% లాభంతో రూ.1965.50 వద్ద ట్రేడవుతున్నాయి. టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ షేర్లు 15% లాభపడి రూ.7,534.90కి చేరాయి. టాటా కెమికల్స్ షేర్లు కూడా 8.5% పెరిగి రూ.1,200కి చేరాయి.

Also Read :  రతన్ టాటా అంత్యక్రియలు.. ఏ సంప్రదాయం ప్రకారం అంటే?

#tata-group #stock-market #ratan-tata
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe