లాస్‌తో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. ప్రముఖ కంపెనీల షేర్లు నష్టాల్లో

నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం సెన్సెన్స్ 444 పాయింట్లతో 80,561 వద్ద ట్రేడవుతోంది. సీఎస్, భారతీ ఎయిర్‌టెల్, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్ షేర్లు మాత్రమే లాభాల్లో ట్రేడవుతుండగా.. మిగతావి నష్టాల్లో ఉన్నాయి.

Stock Market: ఎలక్షన్ రిజల్ట్స్ ఎఫెక్ట్.. ఇన్వెస్టర్ల సంపద 21 లక్షల కోట్లు ఢమాల్!
New Update

Stock Market: ఈ రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. కొన్ని కంపెనీలు విడుదల చేసిన రెండో త్రైమాసిక ఫలితాలు అంతగా లేవనే చెప్పవచ్చు. అయితే ఈ రోజు సెన్సెక్స్ (Sensex) 444 పాయింట్లతో 80,561 వద్ద నష్టాల్లో ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 130 పాయింట్లు తగ్గి 24,625 వద్ద ప్రస్తుతం కొనసాగుతోంది. డాలర్‌తో రూపాయి విలువ 84.07 వద్ద ఉంది. ప్రస్తుతం ప్రముఖ కంపెనీల షేర్లు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి.

ఇది కూడా చూడండి: Infosys: రెండో త్రైమాసికంలో ఇన్ఫీ నికర లాభం.. ఎన్ని కోట్లంటే?

నష్టాల్లో ట్రేడ్..

ముఖ్యంగా టైటాన్, నెన్లే ఇండియా, ఇన్ఫోసిస్, మారుతీ సుజుకీ, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా షేర్లు అన్ని ప్రస్తుతం నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 30 సూచీల్లో కేవలం నాలుగు కంపెనీలు మాత్రమే ట్రేడవుతున్నాయి. టీసీఎస్, భారతీ ఎయిర్‌టెల్, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్ షేర్లు మాత్రమే లాభాల్లో నడుస్తున్నాయి. 

ఇది కూడా చూడండి: Sajjala ramakrishna reddy: తెలీదు.. గుర్తులేదు.. మర్చిపోయానన్న సజ్జల

ఇదిలా ఉండగా.. ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ రెండో త్రైమాసికంలో లాభాలను పొందింది. ఏకంగా రూ.6,506 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసుకుంది. గతేడాదితో రూ.6,212 కోట్ల లాభం పొందిన ఇన్ఫోసిస్ ఈ ఏడాది 4.7% అధికంగా లాభాలను పొందింది. వీటితో పాటు కార్యకలాపాల ఆదాయం రూ.38,994 కోట్ల ఉండగా.. 5.1% పెరిగి రూ.40,986 కోట్లకు చేరింది. కంపెనీలోని పెద్ద ఒప్పందాల విలువ 2.4 బిలియన్ డాలర్లు. అయితే బోర్డులో ఉన్న ఒక్కో షేర్‌కు మధ్యంతర డివిడెండు కంపెనీ ప్రకటించింది.

ఇది కూడా చూడండి:  BIG BREAKING: హరీష్ రావు బంధువులపై కేసు నమోదు!

ఒక్కో షేరుకు రూ.21 మధ్యంతర డివిడెండు ఇవ్వనున్నట్లు ఇన్ఫోసిస్‌ ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే 16.7 శాతం పెరిగిందని, అక్టోబరు 29 వరకు రికార్డు చేసుకోగా నవంబరు 8లోగా చెల్లించాలని కంపెనీ తెలిపింది. ఏప్రిల్‌లో జరిగిన ఇన్ఫోసిస్ సమావేశంలో ఫిబ్రవరి 2025 నుంచి ఫిబ్రవరి 2029 వరకు వచ్చే 5 సంవత్సరాలకు దాని మూలధన కేటాయింపు విధానాన్ని సమీక్షించింది.

ఇది కూడా చూడండి: Israel: యహ్యా సిన్వార్ మృతి..ధృవీకరించిన ఇజ్రాయెల్

#stock-market-news #stock-market-today
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe