Stock Market:
నిన్నటి లాభాలను కొనసాగిస్తూ ఈరోజు ఉదయం దేశీ స్టాక్ మార్కెట్లు లాభాలతోనే ప్రారంభం అయ్యాయి. చాలాసేపటి వరకూ అదే బాటలో పయనించాయి. అయితే రోజు ముగిసేసరికి ఆఖర్లో అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి జారిపోయాయి సూచీలు. ముఖ్యంగా రియలెన్స్, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు తవ్రంగా నష్టపోయాయి. సెన్సెక్స్ ఉదయం 81,954.58 పాయింట్ల దగ్గర లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 82,319.21 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. 250 పాయింట్లకు పైగా నష్టపోయి 81,342 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరికి 167 పాయింట్ల నష్టంతో 81,467 వద్ద ముగిసింది. నిఫ్టీ 31.20 పాయింట్ల నష్టంతో 24,981 వద్ద స్థిరపడింది. కానీ BSE స్మాల్ క్యాప్ మాత్రం 670 పాయింట్లు లాభపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.96గా ఉంది.
సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 17 పెరగ్గా.. 13నష్టపోయాయి. 50 నిఫ్టీ స్టాక్‌లలో 31 క్షీణించగా, 19 పెరిగాయి. FMCG , ఆయిల్ & గ్యాస్ మినహా అన్ని రంగాలలో పెరుగుదల ఉంది. రిలయన్స్, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, లార్సెన్ అండ్ టూబ్రో మార్కెట్‌ను ఎక్కువగా కిందికి లాగాయి. ఎస్‌బీఐ, భారతీ ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంక్‌లు మాత్రం మార్కెట్‌ను పెంచడానికి దోహదపడ్డాయి. ఆసియా మార్కెట్‌లో జపాన్‌కు చెందిన నిక్కీ 0.87% పెరిగింది. హాంకాంగ్‌కు చెందిన హ్యాంగ్‌సెంగ్ సూచీ 1.38%, చైనా షాంఘై కాంపోజిట్ 6.62% పడిపోయాయి.అక్టోబర్ 8న అమెరికాకు చెందిన డౌ జోన్స్ 0.30% పెరిగి 42,080 వద్దకు మరియు నాస్‌డాక్ 1.45% పెరిగి 18,182 వద్దకు చేరుకుంది. S&P 500 కూడా 0.97% పెరిగి 5,751కి చేరుకుంది. NSE డేటా ప్రకారం..విదేశీ పెట్టుబడిదారులు అక్టోబర్ 8న ₹5,729.60 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఈ కాలంలో, దేశీయ పెట్టుబడిదారులు ₹7,000.68 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.
Also Read: టెస్టు క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన జో రూట్.. సచిన్ రికార్డు బద్దలే!?