Stock Market: ఒక్కరోజు ఆనందమే..తిరిగి నష్టాల్లోకి స్టాక్ మార్కెట్ హమ్మయ్య అనుకున్నారు...లాభాల్లోకి వచ్చిందని ఆనంద పడ్డారు. కానీ అది ఒక్కరోజులోనే ఆవిరి అయిపోయింది. నిన్న లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ ఈరోజు మళ్ళీ నష్టాల్లో కూరుకుపోయింది. సెన్సెక్స్ 167, నిఫ్టీ 31 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. By Manogna alamuru 09 Oct 2024 in బిజినెస్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Stock Market: నిన్నటి లాభాలను కొనసాగిస్తూ ఈరోజు ఉదయం దేశీ స్టాక్ మార్కెట్లు లాభాలతోనే ప్రారంభం అయ్యాయి. చాలాసేపటి వరకూ అదే బాటలో పయనించాయి. అయితే రోజు ముగిసేసరికి ఆఖర్లో అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి జారిపోయాయి సూచీలు. ముఖ్యంగా రియలెన్స్, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు తవ్రంగా నష్టపోయాయి. సెన్సెక్స్ ఉదయం 81,954.58 పాయింట్ల దగ్గర లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 82,319.21 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. 250 పాయింట్లకు పైగా నష్టపోయి 81,342 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరికి 167 పాయింట్ల నష్టంతో 81,467 వద్ద ముగిసింది. నిఫ్టీ 31.20 పాయింట్ల నష్టంతో 24,981 వద్ద స్థిరపడింది. కానీ BSE స్మాల్ క్యాప్ మాత్రం 670 పాయింట్లు లాభపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.96గా ఉంది. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 17 పెరగ్గా.. 13నష్టపోయాయి. 50 నిఫ్టీ స్టాక్‌లలో 31 క్షీణించగా, 19 పెరిగాయి. FMCG , ఆయిల్ & గ్యాస్ మినహా అన్ని రంగాలలో పెరుగుదల ఉంది. రిలయన్స్, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, లార్సెన్ అండ్ టూబ్రో మార్కెట్‌ను ఎక్కువగా కిందికి లాగాయి. ఎస్‌బీఐ, భారతీ ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంక్‌లు మాత్రం మార్కెట్‌ను పెంచడానికి దోహదపడ్డాయి. ఆసియా మార్కెట్‌లో జపాన్‌కు చెందిన నిక్కీ 0.87% పెరిగింది. హాంకాంగ్‌కు చెందిన హ్యాంగ్‌సెంగ్ సూచీ 1.38%, చైనా షాంఘై కాంపోజిట్ 6.62% పడిపోయాయి.అక్టోబర్ 8న అమెరికాకు చెందిన డౌ జోన్స్ 0.30% పెరిగి 42,080 వద్దకు మరియు నాస్‌డాక్ 1.45% పెరిగి 18,182 వద్దకు చేరుకుంది. S&P 500 కూడా 0.97% పెరిగి 5,751కి చేరుకుంది. NSE డేటా ప్రకారం..విదేశీ పెట్టుబడిదారులు అక్టోబర్ 8న ₹5,729.60 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఈ కాలంలో, దేశీయ పెట్టుబడిదారులు ₹7,000.68 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. Also Read: టెస్టు క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన జో రూట్.. సచిన్ రికార్డు బద్దలే!? #stock-market #stock-market-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి