/rtv/media/media_files/2025/09/13/smart-tv-offers-1-2025-09-13-11-37-53.jpg)
Smart Tv Offers
ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్ సెప్టెంబర్ 23 నుండి ప్రారంభం కానుంది. ఈ సేల్ ప్రారంభం కాకముందే.. పలు స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా 43, 55 అంగుళాల LED స్మార్ట్ టీవీలు ఈసారి భారీ డిస్కౌంట్లను పొందుతున్నాయి. ఫిలిప్స్, TCL, Xiaomi, Thomson, Foxsky వంటి ప్రముఖ బ్రాండ్ల టీవీలను ఇప్పుడు చాలా తక్కువ ధరలకు కొనుక్కోవచ్చు. ఇప్పుడు వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం.
Philips Frameless Smart TV
ఇంట్లోకి స్లిమ్ అండ్ స్టైలిష్ టీవీ కావాలనుకుంటే.. ఫిలిప్స్ 55-అంగుళాల ఫ్రేమ్‌లెస్ స్మార్ట్ టీవీ ఒక గొప్ప ఎంపిక. దీని అసలు ధర రూ. 49,999 ఉండగా.. ప్రస్తుతం ఇది ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 34,999కే అందుబాటులో ఉంది. అంటే 30% తగ్గింపు లభిస్తుంది. ఇది పూర్తి HD డిస్ప్లే, ఆండ్రాయిడ్ టీవీ ప్లాట్‌ఫామ్‌తో వస్తుంది.
TCL iFFALCON 4K Smart Tv
4K టీవీ కొనాలని ప్లాన్ చేస్తున్నట్లయితే ఈ ఆఫర్ మీకు సరైనది. TCL iFFALCON 43 అంగుళాల స్మార్ట్ టీవీ లాంచ్ ధర రూ.50,999 ఉండగా.. ఇప్పుడు కేవలం రూ.22,999 కు అందుబాటులో ఉంది. అంటే 54% ఆదా అవుతుంది. ఇది Google TV ప్లాట్‌ఫామ్‌పై నడుస్తుంది. సున్నితమైన అనుభవాన్ని అందిస్తుంది. అన్ని ప్రధాన స్ట్రీమింగ్ యాప్‌లకు యాక్సెస్‌ను అందిస్తుంది.
Xiaomi F Series Smart Tv
ఫ్లిప్‌కార్ట్‌లో Xiaomi F సిరీస్ స్మార్ట్ టీవీ ధర రూ.21,999కి తగ్గింది. ఇది గతంలో రూ.42,999కి లాంచ్ అయింది. అంటే 48% తగ్గింపు లభిస్తుంది. దీనికి ఫైర్ టీవీ ప్లాట్‌ఫామ్ ఉంది. ఇది అలెక్సాను కూడా సపోర్ట్ చేస్తుంది. దీని ద్వారా మీరు వాయిస్ కమాండ్‌లతో టీవీని కంట్రోల్ చేయవచ్చు. అనేక స్ట్రీమింగ్ యాప్‌లకు యాక్సెస్ లభిస్తుంది.
Thomson Smart TV
థామ్సన్ 43-అంగుళాల స్మార్ట్ టీవీని ఇప్పుడు కేవలం రూ.17,999కి కొనుగోలు చేయవచ్చు. ఇది లాంచ్ సమయంలో రూ.33,999కి అందుబాటులోకి వచ్చింది. దీనిలో మీరు 47% తగ్గింపుతో పాటు 40W శక్తివంతమైన సౌండ్ అవుట్‌పుట్‌ను పొందుతారు. దీనితో పాటు కంపెనీ ఈ మోడల్‌పై రూ.5,400 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కూడా అందిస్తోంది.
Foxsky Smart TV
అతి తక్కువ ధరకు స్మార్ట్ టీవీని కొనాలనుకుంటే.. ఫాక్స్‌స్కీ 43-అంగుళాల స్మార్ట్ టీవీ హైలైట్. ఇది రూ.41,499కి లాంచ్ కాగా.. ఇప్పుడు కేవలం రూ.12,499లకే సొంతం చేసుకోవచ్చు. అంటే 69% వరకు తగ్గింపును పొందుతారు. ఇది ఆండ్రాయిడ్ టీవీ ప్లాట్‌ఫామ్‌పై నడుస్తుంది. 1-సంవత్సరం వారంటీతో వస్తుంది.