ప్రముఖ టెక్ బ్రాండ్ రియల్ మి కొత్త కొత్త ఫోన్లను లాంచ్ చేస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. దేశీయ మార్కెట్ లో ఇతర బ్రాండ్ లకు గట్టి పోటీనిస్తూ దూసుకుపోతుంది. ఇందులో భాగంగానే ఈ ఏడాది మేలో Realme GT Neo 6 స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. ఇందులో Snapdragon 8s Gen 3 SoC, 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందించి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక ఇప్పుడు దీనికి అప్డేట్ వెర్షన్ ని భారతదేశంలో లాంచ్ చేసేందుకు సిద్ధంగా ఉంది.
Realme GT Neo 7
త్వరలో Realme GT Neo 7 స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు రెడీ అయింది. తాజాగా ఈ ఫోన్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, ప్రాసెసర్ వివరాలు లీక్ అయ్యాయి. దీని ప్రకారం.. ఈ ఫోన్ లో ప్రాసెసర్ కింద Snapdragon 8 Gen 3 చిప్‌సెట్ అందించే అవకాశం ఉందని చెప్పబడింది. అలాగే ఈ ఫోన్ 1.5K రిజల్యూషన్‌తో కూడిన డిస్‌ప్లేను కలిగి ఉండవచ్చని ఓ టిప్ స్టర్ పేర్కొన్నాడు.
ఇది కూడా చదవండిః బ్లాక్ బస్టర్ ఆఫర్స్.. రూ.10 వేల లోపే బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్లు
అంతేకాకుండా ఈ ఫోన్ కి సంబంధించిన టైమ్ లైన్ సైతం అతడు వెల్లడించాడు. ఈ ఏడాది చివరి నాటికి ఈ స్మార్ట్ ఫోన్ విడుదలయ్యే అవకాశం ఉందని చెప్పబడింది. అలాగే బ్యాటరీ, ఛార్జింగ్ వంటి సమాచారం వెల్లడించాడు. Realme GT Neo 7 దాని ముందు మోడల్ కంటే మరింత పెద్ద బ్యాటరీని పొందే అవకాశం ఉందని చెప్పాడు. ఇది 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వచ్చే ఛాన్స్ ఉందని వెల్లడించాడు.
Realme GT Neo 6 Specifications
Realme GT Neo 6 స్మార్ట్ ఫోన్ 1.5K రిజల్యూషన్‌తో 6.78 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో వచ్చింది. ఈ ఫోన్ Snapdragon 8s Gen 3 SoC చిప్‌సెట్‌తో వచ్చింది. ఇందులో గరిష్టంగా 16 GB RAM, 1TB స్టోరేజీ ఆప్షన్ అందించబడింది. కెమెరా విషయానికొస్తే.. ఫోన్ వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కలిగి ఉంది. ఇది 120W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పెద్ద 5500mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ CNY 2,099 (సుమారు రూ. 22,000) ప్రారంభ ధరతో లాంచ్ అయింది.