రతన్ టాటా.. ప్రతి రంగంలోనూ తనదైన ముద్ర వేశారు. వ్యాపారం చేసి సంపాదించడమే కాదు.. దానిలో నుంచి ఎక్కువ భాగాన్ని సేవా కార్యక్రమాలకు విరాళాలుగా ఇచ్చారు. ఎంత ఎత్తుకు ఎదిగినా గర్వం లేకపోవడం, విజయం సాధించామని పొంగిపోవడం రతన్ టాటాకు తెలియదు. ఆయన ఆలోచనలు, శ్రమే టాటాను ఇంతటి గొప్ప వ్యక్తిని చేశాయి. మరి ఇన్ని విజయాలు సాధించినా.. కోట్లకు అధిపతిగా ఉన్నా.. ఆయన ఎందుకు పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉండిపోయారు అనేది అందరిలో వచ్చే డౌట్.
దీనిపై పలు కథనాలు సైతం ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే రతన్ టాటా తన జీవితంలో నలుగురు వ్యక్తులను ప్రేమించాడని.. అవన్నీ పెళ్లి వరకు వెళ్లి ఆగిపోయాయని పలు కథనాలు ఉన్నాయి. ఆ నలుగురిలో బాలీవుడ్ ఫేమస్ హీరోయిన్ సిమి గరేవాల్ (Simi Garewal) ఒకరు. రతన్ టాటా - సిమి గరేవాల్ ఒకప్పడు డీప్ లవ్ లో ఉండేవారు. వీరి ప్రేమాయణం ఎన్నో ఏళ్లు సాగింది. పెళ్లి కూడా చేసుకుందాం అని అనుకున్నారు. కానీ చివరికి వీరిద్దరి వివాహం ఆగిపోయింది. ఇదే రతన్ టాటా ఆఖరి ప్రేమ వ్యవహారం అని టాక్. సిమి గరేవాల్ తో ప్రేమ విఫలం చెందడంతో రతన్ టాటా తీవ్ర బావోద్వేగానికి గురుయ్యారు.
ఇది కూడా చదవండిః కన్నీళ్లు పెట్టించే రతన్ టాటా ప్రేమ కథ.. ఆమె కోసమే పెళ్లి చేసుకోలేదా?
దీంతో తన మనస్సులో మరెవరికీ చోటు ఇవ్వకూడదని ఫిక్స్ అయ్యారు. అంతేకాకుండా తన జీవితంలోకి కూడా మరెవరినీ తీసుకొచ్చేందుకు ఇష్టపెట్టుకోలేదు. ప్రేమ, పెళ్లికి దూరమవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఇక ఆ తర్వాత సిమి గరేవాల్ 76 ఏళ్ల వయసులో సింగిల్ గానే జీవిస్తున్నారు. అయితే రతన్ టాటాతో తనకు పరిచయం ఎప్పుడు ఏర్పడింది, అది ప్రేమగా ఎలా మారింది అనే విషయాన్ని సిమి గరేవాల్ అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
రతన్ టాటాతో పరిచయం అప్పుడే
రతన్ టాటా విదేశాల నుంచి చదువుకొని ఇండియా తిరిగొచ్చారు. అదే సమయంలో సిమి గరేవాల్ పరిచయం అయింది. కొద్ది రోజులు ఫ్రెండ్స్ గా చక్కర్లు కొట్టారు. ఆ తర్వాత ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఇదే విషయం గురించి ఓ ఇంటర్వ్యూలో సిమి గరేవాల్ వెల్లడించారు. రతన్ చాలా మంచి వ్యక్తి.. ఎప్పటికీ తన మనసులో ఆయన పట్ల గౌరవం, ప్రేమ ఉంటుందని పేర్కొంది. అనంతరం తమ పెళ్లి జరగకపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయని తెలిపింది. అదే ఇంటర్వ్యూలో సిమి.. రతన్ టాటాపై ప్రశంసలు కురిపించారు.
నువ్వు లేవని అనుకోవడమే కష్టంగా ఉంది
రతన్ టాటా మరణంపై సిమి గరేవాల్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. “నువ్వు వెళ్లిపోయావని అంటున్నారు. నువ్వు లేవని అనుకోవడమే కష్టంగా ఉంది. నా మిత్రుడా.. నీకు వీడ్కోలు” అంటూ ట్వీట్ చేశారు.