Holidays: విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త.. మరో రెండు రోజులు సెలవులు!

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలో మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలోని అన్ని స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లాల కలెక్టర్లు వెల్లడించారు

New Update
tg rains

Holidays: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలో మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి.  ఈ నేపథ్యంలో ఏపీ సర్కార్ పలు జిల్లాల్లోని స్కూళ్లకి 2 రోజులు సెలవులు ప్రకటించింది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బుధవారం నాటికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని, ఆ తర్వాత అది తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర మధ్య తీరంటాదే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Also Read: బంగాళాఖాతంలో నేడు తీవ్ర అల్పపీడనం..ఆ జిల్లాల్లో భారీ వర్షాలు!

ఈ తుపాను ప్రభావం కారణంగా ఏపీతోపాటుగా తమిళనాడులోని పలు జిల్లాల్లో  భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఐఎండీ అధికారులు చెప్పారు. ఈ తుపాను కారణంగా ఏపీలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావద్దని అధికారులు చెప్పారు.

Also Read: పాక్ ఓటమి.. ఇండియా ప్రపంచ కప్ ఆశలు ఆవిరి

స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాలకు

 

ఈ అల్పపీడనం ప్రభావం కారణంగా రానున్న మూడు రోజులు ఏపీలోని పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. నేడు ఏపీలోని పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ పేర్కొంది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ముందుస్తు చర్యల్లో భాగంగా విద్యార్థుల రాకపోకలు సాగించడానికి ఇబ్బంది పడతారని  ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలోని అన్ని స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లాల కలెక్టర్లు వెల్లడించారు. 

Also Read: నేడు కొత్త టీచర్లకు పోస్టింగులు

సెలవులు ప్రకటించే...

ఈ క్రమంలో ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, పల్నాడు,  పశ్చిమగోదావరి, , ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లో కూడా స్కూళ్లకి, కాలేజీలకు సెలవులు ఇవ్వాలని విద్యార్థులు తల్లిదండ్రులు అధికారులను కోరుతున్నారు. ప్రస్తుతం ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నందున సెలవులు ప్రకటించే అవకాశాలున్నాయి. ఈ జిల్లాల్లో కూడా ఉదయం 8 గంటలలోపు స్కూళ్లకి సెలవులు ప్రకటించే అవకాశాలు కనపడుతున్నాయి.

Also Read: మద్యం దుకాణం లాటరీ వచ్చిందనుకునే లోపే ...కిడ్నాప్‌ అయ్యాడు!

ఈ తుపాను ప్రభావం మరో రెండు రోజులు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. దీంతో పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు మరో 17వ తేదీ వరకు సెలవులు ప్రకటించే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్ల నుంచి ఉత్తర్వులు వెలువడాల్సిన అవసరం ఉంది.ఈ తుపాను ప్రభావం తెలంగాణపైన కూడా పడనుంది. దీంతో 17వ తేదీ వరకు తెలంగాణలో కూడా మోస్తరు వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న వాతావరణ శాఖ తెలిపింది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు