Mutual Funds: రూ.1000 ఇన్వెస్ట్ చేయు.. రూ.కోటి పట్టు..  ఈ మ్యాచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడితే డబ్బే డబ్బు

SBI లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్‌లో SIP ద్వారా ప్రతి నెలా కేవలం రూ. 1,000 పెట్టుబడి దీర్ఘకాలికంగా పెట్టడం వల్ల రూ.కోటి వరకు సంపాదించవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. SBI లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ సగటున 16.43 శాతం వార్షిక రాబడిని ఇస్తోంది.

New Update
Mutual Funds

Mutual Funds

తక్కువ డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఒక్కసారిగా డబ్బులు ఎక్కువగా సంపాదించాలని కొందరు కోరుకుంటారు. అయితే కొందరు సంపాదించిన డబ్బులో కొంత పెట్టుబడులు పెడతారు. వీటివల్ల బోలెడన్నీ లాభాలు వస్తాయి. అయితే తొందరగా డబ్బులు సంపాదించాలని కొందరు స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. కానీ ఇందులో లాభాల కంటే నష్టాలు కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే స్టాక్ మార్కెట్ల కంటే మ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల నష్టాల కంటే లాభాలు ఎక్కువగా వస్తుంటాయి. తక్కువ ఇయర్స్ కాకుండా ఎక్కువ ఇయర్స్ డబ్బులను ఇన్వెస్ట్ చేయడం వల్ల భారీగా లాభాలు వస్తాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే మ్యూచువల్ ఫండ్స్‌లో కేవలం వెయ్యి రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే కోటి వరకు లాభాలు వస్తాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు. అదెలాగే మరి ఈ స్టోరీలో చూద్దాం. 

తక్కువ ఇన్వెస్ట్ చేస్తే..

SIP ద్వారా ప్రతి నెలా కేవలం రూ. 1,000 పెట్టుబడి దీర్ఘకాలికంగా పెట్టడం వల్ల రూ.కోటి వరకు సంపాదించవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈక్విటీ ఆధారిత దీర్ఘకాలిక నిధులు పెట్టుబడిదారులకు ఎక్కువ రాబడిని అందిస్తాయి. మీరు SBI లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్. ఇది ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ELSS). ఇది పెట్టుబడిదారులకు దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధి, పన్ను ఆదా అందిస్తుంది. ఈ ఫండ్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడుతుంది. అంటే పెట్టుబడిదారుడి డబ్బులో 90 శాతానికి పైగా బ్యాంకింగ్, ఐటీ, ఇంధనం, ఆరోగ్య సంరక్షణ, మైనింగ్ రంగాలలోని ప్రముఖ కంపెనీలలో పెట్టుబడి పెడుతుంది.

ఇది కూడా చూడండి: Stock Market: బలమైన పెరుగుదలను చూస్తున్న ఐదు స్టాక్స్..డబ్బులే డబ్బులు అంటున్న నిపుణులు

గత కొన్ని సంవత్సరాలుగా SBI లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ సగటున 16.43 శాతం వార్షిక రాబడిని ఇచ్చింది. కాంపౌండింగ్ ప్రభావం కారణంగా ఈ మొత్తం దీర్ఘకాలంలో పెద్ద మొత్తానికి పెరగవచ్చు. ఉదాహరణకు మీరు ప్రతి నెలా రూ.1,000 SIP చేస్తే ఈ మొత్తం 32 సంవత్సరాలలో దాదాపు రూ.1.4 కోట్లు కావచ్చు. అంటే మొత్తం రూ.3.84 లక్షలు పెట్టుబడి పెడతారు. కానీ కోటి కంటే ఎక్కువగా డబ్బులు పొందుతారు. అయితే మీరు తక్కువ ఏళ్లు కూడా పెట్టుకోవచ్చు. 10, 20 ఏళ్లు సిప్ చేస్తే తక్కువ లాభం వస్తుంది. అదే ఇలా ఎక్కువ ఏళ్లు పెట్టడం వల్ల మీరు సిప్ ద్వారా కోటి రూపాయల కంటే ఎక్కువగా డబ్బు సంపాదించవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. 

ఇది కూడా చూడండి: Gold Prices Today: నువ్వా.. నేనా..! గోల్డ్ తో సిల్వర్ పోటీ.. రేట్లు ఎలా ఉన్నాయంటే..?

Advertisment
తాజా కథనాలు