ఈ ఏడాది చివరి నాటికి మతిపోయే టెక్నాలజీ.. అంబానీ మరో సంచలన ప్రకటన!

జియో కన్వెన్షన్ సెంటర్‌లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్విడియా సమ్మిట్ 2024లో ముఖేష్ అంబానీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్‌తో మాట్లాడుతూ ఇప్పుడున్న టెక్నాలజీ కంటే 20 రెట్లు మెరుగైన టెక్నాలజీని ఈ ఏడాది చివరి నాటికి తీసుకొస్తామన్నారు.

New Update

ప్రస్తుతం ఎన్విడియా సమ్మిట్ జియో వరల్డ్ కన్వెన్సన్ సెంటర్‌లో జరుగుతోంది. ఈ క్రమంలో ఎన్విడియా వ్యవస్థాపకుడు, సీఈవో జెన్సన్ హువాంగ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ ఈ సమ్మిట్‌లో భాగంగా అనేక విషయాలపై చర్చించారు. భారత్ దేశం శక్తి, సామర్థాల గురించి అంబానీ జెన్సన్‌కు వివరించారు. ప్రపంచానికి ఇన్నోవేషన్ హబ్‌గా భారతదేశం తయారవుతుందన్నారు.  

ఇది కూడా చూడండి: IAS Amoy Kumar: ఈడీ విచారణకు ఐఏఎస్ అధికారి.. మాజీ మంత్రికి షాక్!

మిగతా దేశాలతో పోలిస్తే..

అమెరికా, చైనా దేశాలతో పోలిస్తే ప్రపంచంలోనే అత్యత్తమ డిజిటల్ కనెక్టివిటీ భారత్‌లో ఉన్నాయని అంబానీ తెలిపారు. మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌కు అపారమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం జియో ప్రపంచంలోనే అతిపెద్ద డేటా కంపెనీగా ఉందన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది చివరికి 20 రెట్లు కంప్యూటర్ సామర్థ్యాలు ఉంటాయని అంబానీ తెలిపారు. 

ఇది కూడా చూడండి: Samantha : ప్రభాస్ - సమంత కాంబోలో మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా?

ఇండియా ప్రపంచానికి కేవలం సీఈఓలను ఇవ్వడమే కాకుండా ఏఐ సేవలను కూడా అందిస్తుందని అంబానీ అన్నారు. గతంలో రిలయన్స్ ప్రకటించినట్లు క్లౌడ్ ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్లాట్‌ఫారమ్‌ను నిర్మించడానికి కావాల్సిన శక్తిని ఎన్విడియా అందిస్తుందన్నారు. దేశంలో ఉండే శాస్త్రవేత్తలు, డెవలపర్లు, స్టార్టప్‌లకు అవసరమైన ఏఐ మౌళిక సదుపాయాలను అందిస్తుంది. అలాగే రిలయన్స్‌కి అవసరమయ్యే ఏఐ చిప్‌లను కూడా ఎన్విడియా అందిస్తోందని అంబానీ తెలిపారు. 

ఇది కూడా చూడండి: Mokshagna : మోక్షజ్ఞ కు జోడిగా స్టార్ హీరోయిన్ కూతురు..?

టెలికాం రంగంలో జియో ఎన్నో సేవలు చేసిందన్నారు. అదే విధంగా ఏఐ రంగంలో మౌలిక సదుపాయాలను అందించడానికి కూడా జియో అంతే విధంగా కృషి  చేస్తుందని అంబానీ తెలిపారు. మిగతా వస్తువుల్లానే ఏఐ కూడా ఇతర దేశాలకు ఎగుమతి చేసేలా తయారవుతుందని అంబానీ పేర్కొన్నారు. ఎన్విడియా అంటే విద్య అని, దేశానికి జ్ఞానాన్ని తెచ్చిపెట్టేదని అంబానీ అన్నారు. దీంతో ఎన్విడియా సీఈఓ జెన్సన్ ముఖేష్ అంబానీ మాటలకు ఆకర్షితులయ్యారు. అంబానీ 20 ఏళ్ల ఇంజనీర్‌లా మాట్లాడుతున్నారని జాన్సన్ అన్నారు. 

ఇది కూడా చూడండి: ఆ సినిమా ఇప్పుడొచ్చుంటే పాన్ ఇండియా హిట్ అయ్యేది.. రామ్ చరణ్ మూవీపై దుల్కర్

#mukesh-amabani #nvidia #jio-conventional
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe