Motorola G85 5G : అతి తక్కువ ధరలో అధునాతన ఫీచర్లు గల స్మార్ట్‌ఫోన్‌ను కొనుక్కోవాలని అందరికీ ఉంటుంది. అలాంటి ఫోన్ కోసం ఇంటర్నెట్‌లో తెగ వెతికేస్తుంటారు. కానీ వారి బడ్జెట్‌కి తగ్గ ఫోన్ దొరకకపోవడంతో ఏదో ఒక మొబైల్ కొనేస్తుంటారు. అయితే ఇప్పుడు అలా బాధ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతి చీపెస్ట్ ధరలోనే కర్వ్డ్ డిస్‌ప్లే, 8జీబీ ర్యామ్, 50 మెగా పిక్సెల్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఒక స్మార్ట్‌ఫోన్‌ను కొనుక్కోవచ్చు. అదెలాగో ఇప్పుడుపూర్తిగా తెలుసుకుందాం.
ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్ ఫార్మ్ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం బిగ్ బిలియన్ డేస్ సేల్ నడుస్తోంది. ఈ సేల్‌లో Motorola G85 5G స్మార్ట్‌ఫోన్‌ను అతి తక్కువ ధరలోనే కొనుక్కోవచ్చు. ఇది రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. అయితే అందులో బేస్ 8జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌పై భారీ ఆఫర్ ఉంది. దీని అసలు ధర రూ.20,999 కాగా ఇప్పుడు బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో 19 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.16,999లకే లిస్ట్ అయింది. అంటే దాదాపు రూ.4,000 డిస్కౌంట్ లభించిందన్నమాట.
Motorola G85 5G Offers
అంతేకాదు దీనిపై భారీ బ్యాంక్ ఆఫర్లు సైతం అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ యాక్సస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. అదే సమయంలో HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు ట్రాన్సక్షన్‌పై రూ.750 లభిస్తుంది. అలాగే HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు ఈఎంఐ ట్రాన్సక్షన్‌పై రూ.1250 తగ్గింపు పొందొచ్చు. ఈ డిస్కౌంట్‌తో ఫోన్‌ని కేవలం రూ.15,749కే పొందొచ్చు. దీనిపై నో కాస్ట్ ఈఎంఐ కూడా లభిస్తుంది.
3 నెలలకు టార్గెట్ పెట్టుకుంటే నెలకు రూ.5,667 చెల్లించాలి. అదే సమయంలో 6 నెలలకు పెట్టుకుంటే నెలకు రూ.2,834 చెల్లించాల్సి ఉంటుంది. ఇదంతా కాకుండా భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా లభిస్తుంది. ఏకంగా రూ.10,450 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందొచ్చు. అప్పుడు ఈ ఫోన్ కేవలం రూ.5,299కే కొనుక్కోవచ్చు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే.. ఇంత పెద్ద మొత్తంలో ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందాలంటే పాత ఫోన్ ఎలాంటి డ్యామేజ్ లేకుండా ఉండాలి. మోడల్ బట్టి ధర నిర్ణయించబడుతుంది.
Motorola G85 5G Specifications
ఈ ఫోన్ 6.67 అంగుళాల పూర్తి-HD+ (1,080 x 2,400 పిక్సెల్‌లు) 3D కర్వ్డ్ పోలెడ్ స్క్రీన్‌ని కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో వచ్చింది. స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌ను కలిగి ఉంది. అంతేకాకుండా అద్భుతమైన ప్రాసెసర్‌తో వచ్చింది. Qualcomm స్నాప్‌డ్రాగన్ 6s Gen 3 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. Android 14-ఆధారిత హలో UIపై నడుస్తుంది.
ఇక కెమెరా విషయానికొస్తే.. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో 50 మెగాపిక్సెల్ Sony Lytia 600 ప్రైమరీ సెన్సార్‌ను కలిగి ఉంది. అదే సమయంలో 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు సింగిల్ LED ఫ్లాష్‌తో డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. ఇక ఫోన్ ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాలింగ్‌ల కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. అలాగే 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చింది.
Also Read : ఒప్పో నుంచి కిక్కిచ్చే ఫోన్.. ఫీచర్లు అదిరిపోయాయ్ గురూ!