Car OFFERS: అదిదా సర్‌ప్రైజ్ - GSTఎఫెక్ట్.. ఆ కంపెనీ కార్లపై 1.43 లక్షల భారీ తగ్గింపు

GST రేట్ల తగ్గింపుతో మహీంద్రా XUV700 కార్ల ధరలు భారీగా తగ్గాయి. టాప్ ఎండ్ వేరియంట్లపై గరిష్టంగా రూ.1.43 లక్షల వరకు తగ్గింపు లభించింది. MX, AX3, AX5, AX7, AX7L వంటి అన్ని వేరియంట్ల ధరలు తగ్గాయి. కొత్త ధరలు సెప్టెంబర్ 22 నుండి అమల్లోకి వస్తాయి.

New Update
mahindra xuv700 cars

mahindra xuv700 cars

చాలా మంది సామాన్యులకు కారు కొనాలని, అందులో తిరగాలని ఉంటుంది. కానీ అధిక ధరల కారణంగా తమ ప్లాన్‌ను మార్చుకుంటున్నారు. ఎప్పుడైనా ఫెస్టివల్ సమయంలో కార్లపై డిస్కౌంట్లు ప్రకటించినపుడు కొనుక్కోవచ్చని అనుకుంటున్నారు. మరి మీరు కూడా అలానే మీ ప్లాన్‌ను ఛేంజ్ చేసుకున్నారా?.. అయితే మీకో గుడ్ న్యూస్. ఇప్పుడు ఓ కార్ల కంపెనీ తన కార్లపై దాదాపు రూ.1.43 లక్షల భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. పూర్తి వివరాల్లో వెళితే.. 

ఇటీవల GST కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో GST పన్ను శ్లాబ్‌లో ప్రధాన నిర్ణయాలు తీసుకుని మార్పులు చేశారు. ఇందులో భాగంగానే ఇప్పటి వరకు నాలుగు శ్లాబ్ రేట్లు ఉండగా.. ఇప్పుడు వాటిని కుదించి మూడు శ్లాబ్ రేట్లుగా కంటిన్యూ చేయాలని నిర్ణయించారు. 

దీని కారణంగానే ఇప్పుడు ఓ కంపెనీ కార్ల ధరలు అమాంతంగా పడిపోయాయి. ఆ కంపెనీ మరేదో కాదు మహీంద్రా. ఈ కంపెనీ తన ప్రసిద్ధ మోడల్ XUV700 ధరలలో భారీ కోత విధించింది. దీని కారణంగా వినియోగదారులు లక్షల రూపాయల కంటే ఎక్కువ డబ్బు ఆదా చేసుకోవచ్చు. 

Mahindra XUV700 Cars Offers

Mahindra XUV700 ఇప్పుడు గతంలో కంటే చాలా చౌకగా మారింది. గతంలో GST రేటు 48% ఉండగా.. ఇప్పుడు దానిని 40%కి తగ్గించారు. ఈ తగ్గిపు తర్వాత కొనుగోలుదారులకు రూ.88,900 నుండి రూ.1.43 లక్షల వరకు ఆదా అవుతుంది. ఈ తగ్గింపు మహీంద్రా కార్లలోని అన్ని వేరియంట్‌లకు వర్తిస్తుంది.

Mahindra XUV700 GST Price: Trim Wise Benefits

Mahindra XUV700 MX వేరియంట్‌పై గతంలో 48 శాతం జీఎస్టీ ఉండగా.. ఇప్పుడు 40 శాతంకి తగ్గింది. అంటే దీనిపై రూ.88,900 తగ్గింపు లభిస్తుంది. 

Mahindra XUV700 AX3 వేరియంట్‌పై గతంలో 48 శాతం జీఎస్టీ ఉండగా.. ఇప్పుడు 40 శాతంకి తగ్గింది. అంటే దీనిపై రూ.1,06,500 తగ్గింపు లభిస్తుంది. 

Mahindra XUV700 AX5 S వేరియంట్‌పై గతంలో 48 శాతం జీఎస్టీ ఉండగా.. ఇప్పుడు 40 శాతంకి తగ్గింది. అంటే దీనిపై రూ.1,10,200 తగ్గింపు లభిస్తుంది. 

Mahindra XUV700 AX5 వేరియంట్‌పై గతంలో 48 శాతం జీఎస్టీ ఉండగా.. ఇప్పుడు 40 శాతంకి తగ్గింది. అంటే దీనిపై రూ.1,18,300 తగ్గింపు లభిస్తుంది. 

Mahindra XUV700 AX7 వేరియంట్‌పై గతంలో 48 శాతం జీఎస్టీ ఉండగా.. ఇప్పుడు 40 శాతంకి తగ్గింది. అంటే దీనిపై రూ.1,31,900 తగ్గింపు లభిస్తుంది. 

Mahindra XUV700 AX7 L వేరియంట్‌పై గతంలో 48 శాతం జీఎస్టీ ఉండగా.. ఇప్పుడు 40 శాతంకి తగ్గింది. అంటే దీనిపై రూ.1,43,000 తగ్గింపు లభిస్తుంది. 

XUV700పై మాత్రమే కాకుండా ఇతర మహీంద్రా వాహనాలపై కూడా ప్రయోజనాలు లభిస్తున్నాయి.

బొలెరో, బొలెరో నియో- ధర రూ. 1.27 లక్షల వరకు తగ్గింది.

XUV3XO- పెట్రోల్ మోడల్ ధర రూ.1.40 లక్షలు, డీజిల్ మోడల్ ధర రూ.1.56 లక్షలు తగ్గింది.

థార్- 2WD డీజిల్ ధర రూ.1.35 లక్షలు, 4WD డీజిల్ ధర రూ.1.01 లక్షలు, థార్ రాక్స్ ధర రూ.1.33 లక్షల వరకు తగ్గింది.

స్కార్పియో క్లాసిక్- ధర రూ. 1.01 లక్షలు తగ్గింది.

స్కార్పియో-ఎన్- రూ. 1.45 లక్షల వరకు తక్కువ ధరకు

ఇలా GST 2.0 రాకతో మహీంద్రా SUVలు మరింత సరసమైనవిగా మారాయి. ఈ కొత్త ధరలు సెప్టెంబర్ 22 నుండి అమల్లోకి వస్తాయి. 

Advertisment
తాజా కథనాలు