ఆ దేశంలో గూగుల్ పిక్సెల్ ఫోన్లు నిషేధం.. కారణమేంటంటే?

ఇటీవల ఇండోనేషియా ఐఫోన్ 16 సిరీస్‌ను నిషేధించగా.. తాజాాగా గూగుల్ పిక్సెల్ ఫోన్లను కూడా దేశంలో నిషేధించింది. దేశంలొ విక్రయించే స్మార్ట్‌ఫోన్లలో కనీసం 40 శాతం స్థానికంగా తయారు చేసిన భాగాలు కలిగి ఉండాలనే నిబంధన పాటించకపోవడం వల్ల నిషేధించినట్లు తెలుస్తోంది.

New Update
Google pixle

ఐఫోన్ 16ను నిషేధించిన కొన్ని రోజులకే ఇండోనేషియా మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో గూగుల్ పిక్సెల్ ఫోన్ల అమ్మకాలను నిషేధిస్తున్నట్లు తెలిపింది. ఇండోనేషియాలో విక్రయించే స్మార్ట్‌ఫోన్లలో కనీసం 40 శాతం స్థానికంగా తయారు చేసిన భాగాలు కలిగి ఉండాలి. కానీ గూగుల్ ఆ నిబంధన పాటించకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకుంది.

ఇది కూడా చూడండి: కార్తీక మాసంలో ఈ పనులు చేస్తే.. దరిద్ర మంతా మీ ఇంట్లోనే..

స్థానిక పెట్టుబడుదారులను ప్రోత్సహించడానికి..

సాంకేతికత, భద్రత, దేశీయ తయారీని ప్రోత్సహించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. యాపిల్ సంస్థకు చెందిన ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లను ఇండోనేషియా ఇటీవల నిషేధించింది. దేశంలో 95 మిలియన్ల డాలర్లు పెట్టుబడులు పెడతామని యాపిల్ సంస్థ తెలిపింది.  కానీ స్థానికంగా స్మార్ట్‌ఫోన్ తయారీని పెంచడం, ఫర్మ్‌వేర్ డెవలప్‌మెంట్‌కు సహకరించకపోవడం వంటివి చేయకపోవడం వల్ల నిషేధించింది.

ఇది కూడా చూడండి: Health Benefits: ఉదయాన్నే ఈ జావ తాగితే.. అనారోగ్య సమస్యలన్నీ మటాష్

ఇండోనేషియాలో పెట్టుబడి పెట్టిన వారందరికీ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతోనే స్థానికంగా 40 శాతం తయారు చేసిన భాగాలు ఉండాలని తెలిపింది. అయితే ఇండోనేషియా మార్కెట్‌లో ఐఫోన్ 16 నిషేధం ఎప్పటి వరకు ఉంటుందో కచ్చితంగా చెప్పలేం. ఇండోనేషియాలోని నిబంధనలు విదేశీ టెక్ కంపెనీలకు ప్రోత్సాహంగా ఉంటే తప్పకుండా ఈ నిషేధం ఎత్తివేయవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. 

ఇది కూడా చూడండి: Spain Floods: స్పెయిన్ వరద బీభత్సం.. 205కి చేరిన మృతుల సంఖ్య

ఇదిలా ఉండగా.. ఇండోనేషియా మార్కెట్‌లో ఐఫోన్ 16 అమ్మకాలు మళ్లీ కొనసాగించాలంటే ఆ దేశం నిబంధనలను పాటించాలి. అయితే దానికి యాపిల్ సంస్థ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు లేదు. ఇండోనేషియా నిబంధనలు పాటించకపోతే ఈ ఫోన్లపై ఇకపై నిషేధం అలాగే ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చూడండి: Vaishnavi Chaithanya: దీపాల వెలుగులో బేబీ బ్యూటీ.. ఎంత అందంగా ఉందో..! 

Advertisment
Advertisment
తాజా కథనాలు