/rtv/media/media_files/2025/05/21/vrv9rPMQqfiD13UaEUlN.jpg)
ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ ఇండస్‌సెంట్‌లో వందల కోట్ల స్కామ్ బయటపడింది. ఇంటర్‌నల్ అడిట్‌లో రూ.173 కోట్ల ఫ్రాడ్ వెలుగుచూసింది. ఫైనాన్షియల్ ఈయర్ 2024-25లో తప్పుడు లెక్కలు ఉన్నట్లుగా ఇండస్‌సెంట్ బ్యాంక్ బోర్డు దృష్టికి వెళ్లింది. అందులో పని చేసే ఉద్యోగులే బ్యాంక్‌లో తప్పుడు లెక్కలు చూపించారని తెలుస్తోంది.
2024 డిసెంబర్ 31తో ముగిసే 3వ త్రైమాసికాల్లో ప్రైవేట్ లోన్స్ అన్నీ మైక్రోఫైనాన్స్ బిజినెస్‌లో ఆదాయంగా రూ.172.58 కోట్లు తప్పుగా నమోదు చేశారు. FY 2024-25 Q4లో అది రివర్స్ చేయబడింది. ఈ మోసానికి పాల్పడింది కొందమంది బ్యాంక్ ఉద్యోగులేనని అనుమానిస్తున్నారు. MFIలో రూ.173 కోట్లు తప్పుగా రికార్డుల్లో నమోదు చేశారని ఇండస్ఇండ్ బ్యాంక్ బోర్డు సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Why Equity investing looks simple but isn't easy:
— ishmohit (@ishmohit1) May 21, 2025
Indusind bank reporting a fraud of 172 crores
Solara: missing its own guidance by some margin
Here is the solution: read about the management past and history. Both are good examples of the importance of reading history. CHAT… pic.twitter.com/kon96jiKsb
దాదాపు 18 సంవత్సరాల్లో మొదటిసారిగా త్రైమాసిక నష్టాన్ని బ్యాంక్ బుధవారం వెల్లడించింది. కొంతమంది బ్యాంక్ ఉద్యోగులే మోసానికి పాల్పడ్డారని అనుమానిస్తున్నట్లు పేర్కొంది. ఇది అకౌంటింగ్ లోపాలకు దారితీసింది. ఇండస్ఇండ్ ఆస్తుల పరంగా భారతదేశంలో ఐదవ అతిపెద్ద ప్రైవేట్ రుణదాతగా ఉంది.
ఏప్రిల్ 29నే CEO సుమంత్ కథ్పాలియా, డిప్యూటీ CEO అరుణ్ ఖురానా బ్యాంకుకు రాజీనామా చేశారు. వారి స్థానాల్లో కొత్తగా బాధ్యతలు స్వీకరించే వరకు లేదా 3 నెలల వ్యవధిలో బ్యాంకు కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ఇండస్ఇండ్ బోర్డు కార్యనిర్వాహకుల కమిటీని నియమించింది.