Festival Sale : పండగ సేల్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్లపై భారీ డిస్కౌంట్లు!

ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో ఫెస్టివల్ సీజన్ సేల్ నడుస్తోంది. ఈ సేల్‌లో రెండు ఈ-కామర్స్ సంస్థలు ఎలక్ట్రిక్ స్కూటర్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించాయి. దీంతో పాటు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో గరిష్టంగా రూ.4000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.

New Update
BIG SALE

ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్, గ్రేట్ అమెజాన్ ఇండియన్ సేల్స్ సెప్టెంబర్ 27న ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఈ సేల్‌లో దుస్తులు, ఇయర్ పాడ్స్, ల్యాప్‌ట్యాప్‌లు, మొబైల్స్ ఇలా ఒకటేంటి.. అన్ని కేటగిరీలకు చెందిన ఐటమ్స్‌పై ఈ-కామర్స్ సంస్థలు భారీ డిస్కౌంట్లు ప్రకటించాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్లపై రేటు తగ్గడంతో చాలామంది ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఈ సేల్స్‌లో భారీ డిస్కౌంట్లతో బాగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు ఏంటో చూద్దాం. 

ఫ్లిప్‌ కార్ట్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు

ఆంపియర్ రియో లి ప్లస్ స్కూటర్ రూ.59,900 ఉండగా ఈ సేల్‌లో రూ.59,400 కి లభిస్తుంది. ఆంపియర్ మాగ్నస్ ఈఎక్స్ ధర రూ.84,900 ఉండగా రూ.82,900కు వస్తుంది. ఆంపియర్ నెక్సస్ ఎస్‌టీ మోడల్ రూ.1,01,999 ఉండగా రూ.94,999కి సేల్‌లో లభిస్తుంది. ఓలా ఎస్‌1 ప్రో ధర రూ.1,34,999 ఉండగా రూ.1,24,999కి ఫ్లిప్ కార్ట్ సేల్‌లో లభిస్తుంది. 

గ్రేట్ ఇండియన్ అమెజాన్ ఫెస్టివల్‌ సేల్

బజాజ్ చేతక్ 2903 మోడల్ స్కూటర్ ధర రూ.99,998 ఉండగా.. ఆఫర్‌లో రూ.89,849కే లభిస్తుంది. రూ.1,19,900 ఉన్న విడా వీ1 ప్లస్ స్కూటర్ తగ్గింపు తర్వాత రూ. 1,15,900కి ఆఫర్‌లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. బజాజ్ చేతక్ ప్రీమియం 2024 రూ.1,38,949 ఉండగా.. తగ్గింపులో రూ.1,25,943కి ఈ సేల్‌లో లభిస్తుంది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో అయితే గరిష్టంగా 4000 తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. 

Also Read :  టెన్త్, ఇంటర్ పరీక్షలపై CBSE సంచలన నిర్ణయం!

Advertisment
తాజా కథనాలు