Honor X60 సిరీస్ తాజాగా లాంచ్ చేయబడింది. కంపెనీ దీనిని చైనాలో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సిరీస్‌లో రెండు మోడల్‌లు ఉన్నాయి. అవి Honor X60, X60 Proలు. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు 108-మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరాను కలిగి ఉన్నాయి. ఇవి ఆండ్రాయిడ్ 14-ఆధారిత MagicOS 8.0 UIపై రన్ అవుతాయి. వనిల్లా మోడల్ MediaTek డైమెన్సిటీ 7025-అల్ట్రా చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది.
Also Read: ఫుట్‌పాత్ ఆక్రమణలే టార్గెట్.. హైడ్రా నెక్ట్స్ యాక్షన్ ప్లాన్ ఇదే!
అయితే X60 ప్రోలో Qualcomm స్నాప్‌డ్రాగన్ 6 Gen 1 SoC ఉంది. రెండు హానర్ స్మార్ట్‌ఫోన్‌లు గరిష్టంగా 12GB RAM, 512GB వరకు స్టోరేజ్‌ను కలిగి ఉంటాయి. గత ఏడాది జూలైలో ప్రారంభించిన హానర్ ఎక్స్50 సిరీస్‌కు సక్సెసర్‌గా హానర్ ఎక్స్60 సిరీస్‌ను విడుదల చేశారు. కొత్త హానర్ స్మార్ట్‌ఫోన్‌ల ధరలు, స్పెసిఫికేషన్‌ల గురించి వివరంగా తెలుసుకుందాం.
Honor X60 Price
Also Read: 'రివాల్వర్ రీటా' వచ్చేసింది.. కీర్తి కొత్త మూవీ టీజర్ అదిరింది
Honor X60 నాలుగు వేరియంట్లలో లాంచ్ చేయబడింది. అందులో 8GB + 128GB వేరియంట్ ధర 1,199 యువాన్ (సుమారు రూ. 14,000) నుండి ప్రారంభమవుతుంది. 8GB+256GB.. 12GB+256GB వేరియంట్‌ల ధరలు వరుసగా 1,399 యువాన్ (సుమారు రూ. 16,500), 1,599 యువాన్ (సుమారు రూ. 18,800)గా ఉన్నాయి. టాప్-ఆఫ్-ది-లైన్ 12GB + 512GB స్టోరేజ్ మోడల్ ధర 1,799 యువాన్ (సుమారు రూ. 21,200)గా కంపెనీ నిర్ణయించింది. ఇది మూడు కలర్ ఆప్షన్లలో ప్రవేశపెట్టబడింది. వీటిలో ఎలిగెంట్ బ్లాక్, మూన్‌లైట్, సీ లేక్ కిన్ వంటివి ఉన్నాయి.
Honor X60, Honor X60 Pro Specifications
Also Read: Isha ఫౌండేషన్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట
Honor X60 స్మార్ట్‌ఫోన్ 6.8-అంగుళాల TFT LCD స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 2412×1080 పిక్సెల్ రిజల్యూషన్‌కు మద్దతు ఇస్తుంది. అదే సమయంలో, రెండు స్మార్ట్‌ఫోన్‌లు గరిష్టంగా 12GB RAM, 512GB వరకు ఇంబిల్ట్ స్టోరేజ్‌ను కలిగి ఉంటాయి. X60 ప్రో ఫోన్‌లో Qualcomm Snapdragon 6 Gen 1 ప్రాసెసర్ అమర్చబడింది. Honor X60 35W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,800mAh బ్యాటరీని కలిగి ఉంది.
Also Read: సైబర్ స్కామ్.. ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో మహిళ బట్టలు విప్పించి..!
అయితే రెండు మోడల్‌లు డ్యూయల్-సిమ్ 5G, Wi-Fi 5 కనెక్టివిటీకి మద్దతు ఇస్తున్నాయి. X60లో బ్లూటూత్ 5.1, X60 ప్రో బ్లూటూత్ 5.3కి అప్‌గ్రేడ్ చేయబడింది. రెండు ఫోన్లు 108-మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా, 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో పాటు సెల్ఫీల కోసం 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉన్నాయి.