Revolver Rita
Revolver Rita: మహానటి సావిత్రి తర్వాత.. అందం, అభినయంతో ఈ తరం సావిత్రిగా పేరు తెచ్చుకున్న అందాల తార కీర్తి సురేష్. ప్రస్తుతం ఈ బ్యూటీ టాలీవుడ్, కోలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా సాగుతోంది. కమర్షియల్ సినిమాలతో పాటు ‘పెంగ్విన్’, ‘మిస్ ఇండియా’, ‘గుడ్‌లక్ సఖి’ వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో మెప్పించిన కీర్తి.. 'రివాల్వర్ రీటా' అంటూ మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Also Read: బిగ్‌బాస్‌లో మత రచ్చ! మెహబూబ్, నబీల్ ఇద్దరికీ రెడ్ కార్డు.. నెటిజన్ల ట్రోల్స్
'రివాల్వర్ రీటా'
నిన్న కీర్తి పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ మూవీని అనౌన్స్ చేయడంతో పాటు టైటిల్ టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఫన్ , యాక్షన్ టచ్ తో సాగిన ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. జేకే చంద్రు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాధిక, అజయ్ ఘోష్, సునీల్, జాన్ విజయ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పాషన్ స్టూడియోస్, ది రూట్ బ్యానర్స్ పై సుధన్ సుందరం, జగదీష్ పళనిసామి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సీన్ రోల్డాన్ సంగీతం అందిస్తున్నారు.
Never underestimate the power of… #RevolverRita Title Teaser playing now
— Think Music (@thinkmusicindia) October 18, 2024
Watch here ▶️: https://t.co/djDewe6Y9Z pic.twitter.com/yXWeQcT3Q5
Also Read: Married Couples : కొత్తగా పెళ్లయిందా? ఈ మూడు పాటిస్తే మీ భార్య మిమల్ని ఎప్పటికీ వదలదు!
Also Read: ఈ దీపావళికి సినిమాల ధమాకా.. ఏకంగా ఆరు చిత్రాల సందడి!
Also Read: ఫెమినా మిస్ ఇండియాగా నిఖిత పోర్వాల్.. రన్నరప్‌లుగా నిలిచింది వీళ్ళే