/rtv/media/media_files/2025/09/24/gst-toll-free-number-2025-09-24-11-31-06.jpg)
GST Toll Free number
పేద, మధ్య తరగతి ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం జీఎస్టీను తగ్గించింది. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందని అందరూ సంతోషించారు. కానీ జీఎస్టీ తగ్గింపు అమల్లోకి వచ్చిన తర్వాత రాకముందు కూడా పేద, మధ్య తరగతి ప్రజలకు ఎలాంటి లాభం లేదు. ఈ పన్ను తగ్గింపు లాభం దుకాణదారులకే ప్రయోజనం ఉంది. నిజానికి పేద, మధ్య తరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని కేంద్రప్రభుత్వం నిత్యావసర సరుకులను తగ్గించింది. చాలా వస్తువుల ధరల్లో పెద్దగా అయితే ఎలాంటి మార్పులు లేవు.
ఇది కూడా చూడండి: Amazon Great Indian Festival Sale: గేమింగ్ ల్యాప్‌టాప్‌లపై 50 శాతం డిస్కౌంట్లు.. అమెజాన్‌లో కళ్లు చెదిరే ఆఫర్లు!
ధరలు తగ్గించడం దుకాణదారులకే లాభం..
జీఎస్టీ శ్లాబులు 18, 12 శాతంలో ఉన్న ధరలు అన్ని కూడా ఇప్పుడు 5 శాతం పరిధిలోకి వచ్చాయి. కానీ సరుకుల ధరలు అయితే తగ్గడం లేదని వినియోగదారులు అంటున్నారు. పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్‌తో పాటు చిన్న సూపర్ బజార్లలో కూడా ధరలు తగ్గించలేదు. పాత స్టాక్‌పై ఉన్న ధరను జీఎస్టీ తగ్గింపుతో ధర వేయాలి. కానీ అలా వేయకుండా ఎమ్‌ఆర్‌పీ ఉన్న ధరతోనే విక్రయిస్తున్నారు. ఎప్పుడైనా ధరలు పెరిగితే మాత్రం రాత్రికి రాత్రి వాటిపై స్టిక్కర్లు వేసి విక్రయిస్తారు. అదే ఇప్పుడు ధరలు తగ్గితే మాత్రం తగ్గించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.
ఇది కూడా చూడండి: Stock Market: వెంటాడుతున్న హెచ్ 1బీ వీసాల భయం..వరుసగా రెండో రోజు నష్టాల్లో స్టాక్ మార్కెట్
వీటిపై చర్యలు తీసుకోకపోతే వినియోగదారుడికి ఎలా మేలు జరుగుతుందని పలువురు అంటున్నారు. అయితే జీఎస్టీ తగ్గింపు ధరకు అమ్మకుండా ఎక్కువ ధరకు అమ్మితే మాత్రం ఫిర్యాదు చేయాలని కేంద్ర పరోక్ష పన్ను, కస్టమ్స్ బోర్డు తెలిపింది. జీఎస్టీ రేట్లు తగ్గించకపోతే నేషనల్ కన్సూమర్ హెల్ప్‌లైన్ టోల్ ఫ్రీ నంబర్ 1915 లేదా 8800001915కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది. అదే ఆన్‌లైన్‌లో అయితే ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ రెడ్రస్సెల్ మెకానిజం పోర్టల్‌లోకి వెళ్లి ఫిర్యాదు చేయవచ్చుని తెలిపింది.
Dial Toll-Free Number 1915 GST Grievance Redressal On National Consumer Helpline Enabledhttps://t.co/HO4aKON6WF#helpline#news#LatestNews#gstgrievanceredressal#nationalconsumer#helpline
— jurishour (@jurishour) September 22, 2025