/rtv/media/media_files/2025/10/17/why-gold-and-prices-are-sky-rocketing-2025-10-17-18-49-36.jpg)
why gold and prices are sky rocketing, Know Details
దేశీయ మార్కెట్‌లో ఈ రోజు బుధవారం బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. 2025 అక్టోబర్ 22వ తేదీన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ3,380 తగ్గింది. దీంతో ధర రూ. 1,27,200కు చేరుకుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ3,100 తగ్గింది. దీంతో ధర రూ. 1,16,600కు చేరుకుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,31,000గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,20,100గా ఉంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,30,800గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,19,900గా ఉంది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,30,570గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,19,690గా ఉంది. విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,30,570గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,19,690గా ఉంది. బంగారం ధరలు స్వల్పంగా తగ్గినప్పటికీ, వెండి ధర మాత్రం భారీగానే పెరిగింది. సుమారు ₹1,81,900 వద్ద ట్రేడవుతోంది.
డాలర్ విలువ బలపడటం
అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్ డాలర్ విలువ బలపడటం, ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయాలు, భౌగోళిక-రాజకీయ అనిశ్చితి వంటి అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. అయినప్పటికీ, పండుగల సీజన్ మరియు దీర్ఘకాలిక పెట్టుబడి డిమాండ్ కారణంగా బంగారం ధరలు స్థిరంగా అధిక స్థాయిలో కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.