Gold Prices: ఇదే మంచి ఛాన్స్‌...భారీగా దిగొచ్చిన ధరలు..!

బంగారం ధరలు గత కొద్ది రోజులుగా దిగి వస్తుండగా..ఈ రోజు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 68 వేల 250 కు పడిపోయింది. ఇక 24 క్యారెట్ల పసిడి రేటు పది గ్రాముల పై రూ.280 మేర తగ్గి రూ. 74 వేల 450 వద్దకు దిగివచ్చింది.

author-image
By Bhavana
Gold Rates
New Update

Gold Prices Dropped Today :సెప్టెంబర్‌ నెల మొదటి నుంచి కూడా బంగారం, వెండి ధరలు వరుసగా పెరుగుతూ వినియోగదారులను హడలెత్తించిన విషయం తెలిసిందే. దీంతో చాలా మంది బంగారం కొనేందుకు వెనుకడుతున్నారు. కానీ అలాంటి వారందరికీ మాత్రం ఇప్పుడు ఓ మంచి అవకాశం వచ్చింది. బంగారం ధరలు గత కొద్ది రోజులుగా దిగి వస్తుండగా..ఈ రోజు భారీగా తగ్గాయి.

Also Read :  భారీ లాభాలతో దూసుకుపోతున్న స్టాక్‌ మార్కెట్లు!

Fed Interest Rates

ఫెడ్ వడ్డీ రేట్ల కోత అంచనాలు ఉన్నప్పటికీ అంతర్జాతీయ మార్కెట్లలో బంగారానికి గిరాకీ తగ్గడంతో ధరలు దిగివస్తున్నాయి. ఆ ప్రభావం దేశీయ మార్కెట్లలో పడుతోంది. అయితే, ప్రస్తుతం పండగల సీజన్ మొదలైన క్రమంలో దేశీయంగా ధరలు మళ్లీ పెరగొచ్చని, ధరలు తగ్గినప్పుడే కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. 

ఈ క్రమంలో హైదరాబాద్ (Hyderabad) మార్కెట్లో నేడు సెప్టెంబర్ 20, 2024 రోజున ధరలు ఎలా ఉన్నాయంటే....హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు (Gold Price) వరుసగా పడిపోతున్నాయి. గత రెండు రోజుల్లో తులం బంగారం ధర రూ.300 తగ్గగా నేడు మరో రూ. 250 మేర పడిపోయింది. దీంతో నేడు 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 68 వేల 250 కు పడిపోయింది. ఇక 24 క్యారెట్ల పసిడి రేటు పది గ్రాముల పై రూ.280 మేర తగ్గి రూ. 74 వేల 450 వద్దకు దిగివచ్చింది. 

ఇక ఢిల్లీలో చూస్తే 22 క్యారెట్ల గోల్డ్ రేట్లు 10 గ్రాములపై రూ.250 తగ్గడంతో రూ.68 వేల 400 వద్దకు దిగివచ్చింది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ రేటు తులంపై రూ.280 తగ్గి రూ.74 వేల 600 వద్దకు పడిపోయింది.హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు తగ్గగా.. వెండి రేట్లు మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం కిలో వెండి రేటు రూ. 96 వేల వద్ద ట్రేడింగ్ అవుతోంది.ఇక ఢిల్లీ మార్కెట్లో చూసుకుంటే కిలో వెండి రేటు రూ.91 వేల వద్ద స్థిరంగా ఉంది.

Also Read :  గణపతి లడ్డూలకు భారీ డిమాండ్.. గతేడాది రికార్డులివే!

#gold-prices #gold-rates
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe