/rtv/media/media_files/2025/05/12/VdwJ1EMQK3eBcLvsDH8j.jpg)
gold rates today monday
గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఎట్టకేలకు తగ్గుముఖం పట్టాయి. 2025 మే 12వ తేదీ సోమవారం రోజున 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1650 తగ్గి రూ. 88 వేల 800గా ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1800 తగ్గి రూ. 96 వేల 800గా ఉంది. దేశ వ్యాప్తంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాద్ లో రూ. 96 వేలు
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 88 వేల 950గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 97 వేలుగా ఉంది. ఇక ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 88 వేల 800గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 96 వేల 880గా ఉంది. ఇక హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 88 వేల 800గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 96 వేల880గా ఉంది. ఇక వైజాగ్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 88 వేల 800గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 96 వేల880గా ఉంది.
ఇక వెండి ధరల విషయానికి వస్తే 2025 మే 12వ తేదీ సోమవారం రోజున కేజీ వెండి ధర ఏకంగా రూ.2 వేలు తగ్గింది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, కోల్ కత్తాలలో రూ. 97 వేల 900గా ఉంది. ఇక చెన్నై, హైదరాబాద్ లో లక్షా 900గా ఉంది. బంగారం, వెండి ధరలు సమయాన్ని ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. వినియోగదారులు దీనిని గమనించాల్సి ఉంటుంది.
gold and silver news | Gold Rates | silver rates | telugu-news
Follow Us