/rtv/media/media_files/2025/04/29/8JZ2R8COUt9Jx6pOt1le.jpg)
jio free gold offer
దీపావళి పండుగ సందర్భంగా జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వినియోగదారుల కోసం ఒక బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. జియో గోల్డ్ 24కే డేస్ పథకం ద్వారా ఉచితంగా బంగారాన్ని అందిస్తున్నారు. ఈ ప్రత్యేక ఆఫర్ అక్టోబర్ 18 నుంచి 23 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ సమయంలో ఎవరైతే రూ.2 వేలు కంటే ఎక్కువ విలువైన డిజిటల్ బంగారాన్ని కొనుగోలు చేస్తారో వారికి 2% అదనపు బంగారం ఉచితంగా లభిస్తుంది. అయితే జియోఫైనాన్స్, మైజియో యాప్ ద్వారా కస్టమర్లు బంగారం కొంటే.. ఈ అదనపు బంగారం 72 గంటల్లో వారి గోల్డ్ వాలెట్‌లో జమ అవుతుంది.
ఇది కూడా చూడండి: Flipkart Mobile Offers: రూ.3,349లకే Realme 5జీ స్మార్ట్ ఫోన్ - మళ్లీ ఇలాంటి ఆఫర్ రమ్మన్నా రాదు బ్రో..!
రూ.10 లక్షలు విలువైన బహుమతులు..
అంతేకాకుండా రూ.20 వేలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన బంగారం కొనుగోలు చేసిన వారికి రూ.10 లక్షల విలువైన బహుమతులు గెలుచుకునే అవకాశం కూడా ఉంది. ఈ పథకంలో భాగంగా నిర్వహించే జియో గోల్డ్ మెగా ప్రైజ్ డ్రా విజేతలకు స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్ టీవీలు, గోల్డ్ కాయిన్లు, గిఫ్ట్ వోచర్లు వంటి ఆకర్షణీయమైన బహుమతులు అందిస్తారు. ఈ డ్రా విజేతలను అక్టోబర్ 27న ప్రకటిస్తారు. వినియోగదారులు కనీసం రూ.10 తోనే బంగారం పెట్టుబడిని మొదలుపెట్టవచ్చు. ఇప్పుడు బంగారం డిజిటల్‌గా కూడా చాలా మంది కొనుగోలు చేస్తున్నారు. జియోఫైనాన్స్ యాప్ ద్వారా కస్టమర్లు 24కే స్వచ్ఛమైన బంగారాన్ని డిజిటల్‌గా కొనవచ్చు. అమ్మవచ్చు లేదా రీడీమ్ చేసుకోవచ్చు.
ఇది కూడా చూడండి: Gold Prices Drop: దీపావళి వేళ మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు
దీని కోసం దుకాణాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. లావాదేవీలన్నీ సురక్షితంగా, ఎప్పుడైనా, ఎక్కడైనా నిర్వహించుకోవచ్చు. జియోఫైనాన్స్ యాప్ ద్వారా లోన్, ట్రాన్సాక్షన్, సేవింగ్స్, ఇన్వెస్ట్‌మెంట్స్ అన్నీ ఒకే చోట చేసుకోవచ్చు. డిజిటల్ పేమెంట్స్ దిగ్గజం ఫోన్‌పే కూడా ధంతేరాస్, దీపావళి సందర్భంగా ఇలాంటి ఆఫర్‌నే ప్రకటించింది. ఫోన్‌పేలో రూ.2 వేలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన 24కే డిజిటల్ బంగారం కొనుగోలు చేసిన వారికి 2% క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. అయితే ఈ ఆఫర్ అక్టోబర్ 18న ఒక రోజు మాత్రమే అందుబాటులో ఉంటుంది.