Diwali కి ప్రయాణం చేసేవారికి శుభవార్త.. ఈ తేదీల్లో తగ్గిన ఛార్జీలు

గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది దీపావళికి విమాన ప్రయాణాల ఛార్జీలు తగ్గాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక్సిగో పోర్టల్‌పై నెల రోజుల ముందుగా బుక్ చేసుకున్న టికెట్ల ఆధారంగా.. ఈ దీపావళికి టికెట్ ధరలు 20-25 శాతం తక్కువగా ఉన్నాయని విశ్లేషకులు తెలిపారు.

Flight Charges : విమాన ఛార్జీలు దిగివస్తాయా? పార్లమెంట్ కమిటీ సూచనలు ఇవే.. 
New Update

సదూర ప్రాంతాలకు వెళ్లే వారు ఎక్కువగా రైలు లేదా విమాన ప్రయాణాలకు మొగ్గు చూపుతారు. అందులోనూ పండగ వచ్చిందంటే కొందరు ముందు నుంచే టికెట్లు బుక్ చేసుకుంటారు. ఎందుకంటే పండుగ దగ్గరలో టికెట్లు దొరక్కపోవడంతో పాటు రేట్లు అధికంగా ఉంటాయనే ఉద్దేశంతో ముందే ప్లాన్ చేసుకుంటారు. అయితే ఈ ఏడాది దీపావళి సెలవులకు దూర ప్రాంతాలకు విమాన ప్రయాణం చేసేవారికి శుభవార్త అని చెప్పవచ్చు.

ఇది కూడా చూడండి: టీడీపీ ఆఫీస్, చంద్రబాబు నివాసంపై దాడి.. దీని వెనుక సజ్జల హస్తం ఉందా?

గతేడాదితో పోలిస్తే..

ఎందుకంటే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది దీపావళికి టికెట్ ధరలు 20-25 శాతం తక్కువగా ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఇక్సిగో పోర్టల్‌పై నెల రోజుల ముందుగా బుక్ చేసుకున్న వారి టికెట్ల ఆధారంగా విశ్లేషకులు తెలిపారు. అప్పుడు విమాన ఇంధన ధరలు 15 శాతం తక్కువగా ఉంది. అయితే గతేడాది విమాన టికెట్ల ధరలు ఎక్కువగానే ఉన్నాయి. పండుగ కారణంగా కొన్ని మార్గాల్లో విమాన ప్రయాణాలు చేసే వారి సంఖ్య పెరగడంతో రేట్లు పెరిగాయి. 

ఇది కూడా చూడండి: లవర్‌తో పారిపోయిన వివాహిత.. సినిమా రేంజ్‌లో ట్విస్టులే ట్విస్టులు!

గతేడాది దీపావళి పండుగ సందర్భంగా నవంబర్ 10-16 తేదీల్లో ఎక్కువగా ప్రయాణించారు. ఈ ఏడాది అయితే అక్టోబర్ 28 నుంచి నవంబర్ 3 వరకు సెలవులు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో విమాన ప్రయాణాల్లో రేట్లు తగ్గాయి. బెంగళూరు-కోల్‌కతా విమాన టికెట్‌ ధర గతేడాది రూ.10,195 ఉంది. కానీ ఈ ఏడాది 38% తక్కువగా రూ.6,319గా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇది కూడా చూడండి:  దేవర ఫేక్ కలెక్షన్లపై నిర్మాత క్లారిటీ.. ఫ్యాన్స్ ఆనందం కోసమే అలా..!

అలాగే చెన్నై నుంచి కోల్‌కతా టికెట్‌ కూడా రూ.8,725 గతేడాది ఉండగా 36% తగ్గి ఈ ఏడాది రూ.5,604 ఉంది. ముంబయి నుంచి ఢిల్లీ మార్గంలో టికెట్‌ ధర గతేడాది రూ.8,788 ఉండగా ఈ ఏడాది 34% తగ్గి రూ.5,762 ఉంది. వీటితో పాటు హైదరాబాద్ టూ ఢిల్లీ, ఢిల్లీ టూ శ్రీనగర్ మార్గాల్లో కూడా టికెట్ ధరలు 32 శాతం వరకు తగ్గాయని నివేదిక తెలుపుతుంది. 

ఇది కూడా చూడండి:  ప్రాణం తీసిన బెట్టింగ్.. రోజురోజుకీ పెరుగుతున్న కేసులు

#domestic-air-travel #flight-charges #diwali
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe