/rtv/media/media_files/2025/01/23/oYrp4RNm8sKFnzGCfzCP.jpg)
uber ola Photograph: (uber ola)
Notices to Uber, Ola: రైడ్ హైయరింగ్ ఫ్లాట్‌ఫామ్స్ ఉబర్, ఓలాకు వినియోగదారుల మంత్రిత్వ శాఖ నోటీసులు పంపింది. ఈ యాప్‌లు రైడ్ బుక్ చేసుకునే వినియోగదాలపై స్మార్ట్‌ఫోన్‌ను బట్టి రైడ్ ఛార్జీలు వసూలు చేస్తున్నాయట. ఆండ్రాయిడ్, ఐఫోన్‌లో సేమ్ దూరానికి వేర్వేరు ధరలు చూపిస్తున్నాయని ఢిల్లీలో వినియోగదారులు ఎక్స్‌తో పోస్ట్ చేశారు. ఈ విషయం సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ దృష్టికి వెళ్లింది. మొబైల్ ఫోన్లలో సేమ్ దూరం ప్రయాణించడానికి ఒకరి ఫోన్‌లో ఎక్కువ, మరొకరి ఫోన్‌లో తక్కువ ఛార్జెస్ చూపిస్తున్నాయని వినియోగదారులు ఫిర్యాదు చేశారు.
Also Read : EPFO: తగ్గనున్న అధిక ఫించన్..స్పష్టత ఇచ్చిన ఈపీఎఫ్‌ఓ!
కస్టమర్ ఐఫోన్ లేదా ఆండ్రాయిడ్ ఫోన్ ఉపయోగిస్తున్నారా అనే దానిపై ఛార్జెస్ ఎలా ఆధారపడుతుందని వినియోగదారులు ప్రశ్నిస్తు్న్నారు. ఒకే సేవకు రెండు కంపెనీలు వేర్వేరు ఛార్జీలను వసూలు చేసినట్లు నివేదికల సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA)కు చేరాయి. దీంతో ఆ రెండు రైడ్ హైయరింగ్ ఫ్లాట్‌ఫామ్‌లకు మంత్రిత్వ శాఖ నోటీసులు పంపింది. ఛార్జెస్ వసూలు, పద్దతులను వివరించాలని నోటీసులో కోరింది.
Also Read: పది నిమిషాల్లోనే స్మార్ట్ ఫోన్ డెలివరీ.. బ్లింకిట్ న్యూ సర్వీస్
Also Read : Maha kumbh mela: ఈసారి కప్ నమ్‌దే.. గంగాస్నానం చేసిన ఆర్సీబీ జెర్సీ