/rtv/media/media_files/2025/11/18/cognizant-2025-11-18-11-36-57.jpg)
Cognizant
ఐటీ ఉద్యోగులు ఎంత సమయం పని చేస్తున్నారు? ఎంత సమయం ఖాళీగా ఉంటున్నారని కనిపెట్టడానికి కాగ్నిజెంట్ సంస్థ ఉద్యోగులపై ఓ కన్ను వేసి ఉంచింది. ఈ క్రమంలోనే కొత్త మానిటరింగ్ వ్యవస్థను తీసుకొచ్చింది. కంపెనీ ఇచ్చిన ల్యాప్‌ట్యాప్‌లు, డెస్క్‌టాప్‌ల ద్వారా ఉద్యోగుల పనిని ట్రాక్ చేస్తోంది. వీరు ఉపయోగించే కీబోర్డు, మౌస్‌లను ట్రాకింగ్ కోసం ఉపయోగిస్తుంది. ట్రాకింగ్ కోసం ప్రోహ్యాన్స్ వంటి టూల్స్‌ను ఉపయోగించి ఉద్యోగి ఖాళీగా ఉన్న సమయాన్ని ట్రాక్ చేస్తోంది. మౌస్ లేదా కీబోర్లు కానీ 5 నిమిషాల కంటే ఎక్కువ సమయం ఇన్ యాక్టివ్‌గా ఉంచితే ఆ ఉద్యోగి వర్క్ చేయకుండా ఖాళీగా ఉన్నట్లు భావిస్తారు. అదే 15 నిమిషాల కంటే ఇంకా ఎక్కువ సమయం ఇన్ యాక్టివ్‌గా ఉంటే వేరే పనిలో ఉన్నారని భావిస్తారు. అయితే ఈ మానిటిరింగ్ వ్యవస్థ ఒక్కో టీమ్‌కు వేరేలా ఉంటుందని తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: JEE మెయిన్ 2026 పరీక్షల షెడ్యూల్ విడుదల
🚨 Cognizant starts monitoring employees' time spent on Laptop and Websites with tools like ProHance. pic.twitter.com/5U6yAo93Vm
— Indian Tech & Infra (@IndianTechGuide) November 17, 2025
ఇది కూడా చూడండి: Tesla and Starlink: గుడ్‌న్యూస్.. భారత్‌లో టెస్లా, స్టార్‌లింక్ ఉద్యోగాలు..
ఉద్యోగులు భయపడతారు ఏమోనని..
దీనివల్ల కంపెనీ ఉద్యోగి పని తీరుకు లింక్ పెడతారు ఏమోనని భయపడుతున్నారు. కానీ వాటితో లింక్ ఉండదని కంపెనీలు తెలిపాయి. ప్రమోషన్లు, బోనస్ వంటి అంశాల్లో ఈ డేటాను అసలు ఉపయోగించమని కంపెనీ ప్రతినిధులు తెలుపుతున్నారు. అన్ని సంస్థలా దీనికి కూడా టూల్స్ ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. ఆఖరికి విప్రో వంటి సంస్థలు కూడా ఈ ప్రోహ్యాన్స్ వంటి టూల్స్‌ను ఉపయోగిస్తున్నాయి. ఉద్యోగుల నుంచి అనుమతి కూడా కంపెనీ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే వీరు ఒక్కో టాస్క్ మీద ఎంత సమయం పనిచేస్తున్నారు? ఏ అప్లికేషన్‌ను ఎంత సమయం వాడుతున్నారనే వివరాలను సేకరిస్తున్నట్లు తెలిపారు. కొందరు ఇది మంచి పద్ధతే అని అంటున్నారు. కానీ మరికొందరు మాత్రం దీనివల్ల ఉద్యోగులకు బాగా ఒత్తిడి పెరుగుతుందని విమర్శిస్తున్నారు.
Follow Us