Big Basket IPO: త్వరలో ఐపీఓలోకి బిగ్ బిస్కెట్.. క్విక్ ఫుడ్ డెలివరీకి ఎంట్రీ

ప్రముఖ క్విక్‌ కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ బిగ్‌బాస్కెట్‌ పబ్లిక్‌ ఇష్యూలోకి ఎంట్రీ ఇవ్వాలని ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం క్విక్ కామర్స్ విభాగానికి భారీగా డిమాండ్ పెరగడంతో బిగ్ బాస్కెట్ ఈ నిర్ణయం తీసుకుంది. మరో 24 నెలలో ఐపీఓలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

New Update
Big Basket IPO

Big Basket IPO Photograph: (Big Basket IPO)

ప్రముఖ క్విక్‌ కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ బిగ్‌బాస్కెట్‌ పబ్లిక్‌ ఇష్యూలోకి ఎంట్రీ ఇవ్వాలని ప్లాన్ చేస్తోంది. టాటా గ్రూప్‌ యాజమాన్యంలో ఉన్న బిగ్ బాస్కెట్ అన్ని వస్తువులను కూడా కొన్ని నిమిషాల్లోనే డెలివరీ చేస్తుంది. అయితే ప్రస్తుతం క్విక్ కామర్స్ విభాగంలో భారీగా డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలోనే  ఐపీఓకు వెళ్లాలని భావిస్తోంది.

ఇది కూడా చూడండి: SLBC: డాక్టర్‌గా చెబుతున్నా.. టన్నెల్‌లో చిక్కుకున్న వారి పరిస్థితి ఇది.. ఎమ్మెల్యే వంశీకృష్ణ సంచలన ప్రకటన!

రిటైల్ సమ్మిట్‌లో భాగంగా..

బిగ్ బాస్కెట్ 2026 మార్చి నాటికి బిగ్ బాస్కెట్‌ ఐపీఓలోకి ఎంట్రీ ఇవ్వాలని ప్లాన్ చేస్తుంది. దేశంలో బిగ్ బాస్కెట్ సేవలు ప్రస్తుతం 35 నగరాల్లో ఉన్నాయి. వచ్చే ఏడాదికి వాటిని 70కి పెంచాలని భావిస్తుంది. ఈ విషయాన్ని ఇటీవల ముంబైలో జరిగిన రిటైల్‌ సమ్మిట్‌లో ప్రకటించింది. త్వరలో క్విక్‌ ఫుడ్‌ డెలివరీ విభాగంలో అడుగు పెడతామని వెల్లడించింది. కానీ సరిగ్గా ఎప్పటి నుంచి ఈ సేవలు ప్రారంభిస్తామనే విషయాన్ని మాత్రం తెలపలేదు. 

ఇది కూడా చూడండి: Crime: 13ఏళ్ల పగ.. నంబర్ బ్లాక్ చేసిన ప్రియుడిని కత్తితో పొడిచి, కారు ఎక్కించిన యువతి.. లాస్ట్ ట్విస్ట్ అదిరింది!

ఇది కూడా చూడండి: Viral Video: ఎవర్రా మీరంతా.. ఇండియాలో ఇద్దరు మగాళ్ల పెళ్లి.. డ్యాన్స్‌లతో హోరెత్తించిన తల్లిదండ్రులు!

దేశంలో ప్రస్తుతం జొమాటో-బ్లింకిట్, స్విగ్గీ-ఇన్‌స్టామార్ట్ క్విక్ కామర్స్ విభాగంలో దూసుకెళ్తున్నాయి. ముఖ్య నగరాల్లో ఆర్డర్ చేసిన పది నిమిషాల్లోనే వస్తువులను డెలివరీ చేస్తున్నాయి. బిగ్ బాస్కెట్ కూడా తమ వ్యాపారాన్ని మరింత విస్తరించాలని ప్లాన్ చేస్తుంది. 

ఇది కూడా చూడండి: TG High Court: ప్రీమియర్, బెనిఫిట్ షోలపై హైకోర్టు సంచలన నిర్ణయం.. అనుమతించాలంటూ ఉత్తర్వులు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు