December 2024 Bikes: డిసెంబర్‌లో వచ్చిన బెస్ట్ బడ్జెట్ & మైలేజ్ బైక్స్‌ ఇవే..!

డిసెంబర్ 2024లో బెస్ట్ టూవీలర్ వాహనాలు లాంచ్ చేయబడ్డాయి. కేటీఎం ఆర్‌సి 125, హోండా యాక్టివా 125, హోండా యునికార్న్ 160, కవాసకి Z650RS, కవాసకి KLX 230 డ్యూయల్ స్పోర్ట్ బైక్‌లు ఈ నెలలో లాంచ్ అయ్యాయి. మరో రెండు రోజుల్లో 2024 పూర్తి కానుండటంతో రిలీజ్ అయ్యాయి.

New Update
DECEMBER 2024 LAUNCHED BIKES

DECEMBER 2024 LAUNCHED BIKES

2024 సంవత్సరం మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ ఏడాది ప్రారంభం జనవరి నుంచి మొదలుకొని డిసెంబర్ వరకు అధునాతన ఫీచర్లతో కూడిన కొత్త కొత్త టూవీలర్లు రిలీజ్ అయ్యాయి. ప్రతి నెల మార్కెట్‌లోకి అద్భుతమైన టూ వీలర్ వెహికల్స్ లాంచ్ అవుతూనే ఉన్నాయి. ఇక ఈ ఏడాది మరో రెండు రోజుల్లో ముగియనుండగా.. వాహన తయారీ కంపెనీలు మంచి పెర్ఫామెన్స్ అండ్ ఆకర్షణీయమైన టూవీలర్లను రిలీజ్ చేశాయి. 

వాటిలో కేటీఎం, హోండా, కవాసకి వంటి అనేక దిగ్గజ బైక్‌ల తయారీ కంపెనీల నుంచి పలు మోడళ్లు 2024 డిసెంబర్‌లో లాంచ్ అయ్యాయి. ఇప్పుడు వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం. 

KTM RC 125 

మార్కెట్‌లో కేటీఎం బైక్‌లకు అదిరి పోయే పాపులారిటీ ఉంది. ఈ నెలలో KTM RC 125 మోడల్ రిలీజ్ అయింది. కంపెనీ దీనిని రూ.1,81,913 ఎక్స్-షోరూమ్ ధరతో తీసుకొచ్చింది. ఈ బైక్ 124.7 cc ఇంజిన్ కెపాసిటీతో వచ్చింది. ఇది 14.5 ps పవర్, 12 Nm గరిష్ట టార్కును ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజిన్‌ 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వచ్చింది. 37 కిమీ మైలేజీ ఇస్తుంది. దీనితో పాటు మరెన్నో అద్బుతమైన, అధునాతన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 

ఇది కూడా చూడండి: వార్తాసంస్థలపై చట్టపరంగా చర్యలు–కేటీఆర్

Honda Activa 125

హూండా కంపెనీ దేశంలోని ప్రముఖ అగ్ర కంపెనీల్లో ఒకటి. ఎప్పటికప్పుడు కొత్త కొత్త వాహనాలను లాంచ్ చేస్తూ వాహన ప్రియుల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ నెలలో 2025 Honda Activa 125 తీసుకొచ్చింది. ఇది తక్కువ స్థాయిలో కాలుష్య కారక ఉద్గారాలను విడుచేయడానికి OBD2B ఇంజిన్ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. ఈ 2025 Honda Activa 125 మోడల్ 123.92 సిసి ఇంజిన్‌ను కలిగి ఉంది. అలాగే ఇది 8.3 బిహెచ్‌పీ పవర్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. కంపెనీ దీనిని రూ.94,922 ధరతో తీసుకొచ్చింది.

ఇది కూడా చూడండి: రుతుపవనాల సీజన్‌ లో అల్పపీడనాలు..ఎందుకింత తీవ్రం!

Honda Unicorn 160

హూండా కంపెనీ Honda Unicorn 160 బైక్‌ను మార్కెట్‌లో విడుదల చేసింది. దీనిని రూ.1.19 లక్షల ఎక్స్ షోరూమ్ ధరతో తీసుకొచ్చింది. 162.7 సింగిల్ సిలిండర్‌, ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌‌తో వచ్చింది. ఈ బైక్ 13 బిహెచ్‌పీ పవర్, 14.5 ఎన్ఎమ్ టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. 

ఇది కూడా చూడండి:  AP: పవన్ కల్యాణ్ పర్యటనలో నకిలీ సెక్యూరిటీ సూర్యప్రకాష్ కథ ఇదే..

kawasaki Z650RS

కవాసకి కంపెనీ బైక్‌లకు మార్కెట్‌లో అద్భుతమైన క్రేజ్ ఉంది. అదే క్రేజ్‌తో ఈ కంపెనీ డిసెంబర్‌లో kawasaki Z650RS బైక్‌ను వచ్చే ఏడాది కోసం రిలీజ్ చేసింది. ఈ బైక్ రూ.7.20 లక్షల ఎక్స్ షోరూమ్ ధరతో వచ్చింది. ఈ బైక్ 649 సిసి సమాంతర ట్విన్ ఇంజిన్‌ను కలిగి ఉంది. అలాగే 67బిహెచ్‌పి పవర్, 64ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. 

ఇది కూడా చూడండి: మరో కొత్త ప్రయోగంతో ఇస్రో రెడీ..రేపు PSLV-C60 కౌంట్డౌన్

Kawasaki KLX 230 Dual Sport

కవాసకి కంపెనీ kawasaki Z650RS బైక్‌తో పాటు Kawasaki KLX 230 Dual Sport బైక్‌ను లాంచ్ చేసింది. అడ్వెంచర్‌లను కోరుకునే బైక్ ప్రియులకు ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. ఈ బైక్ 233 సిసి సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఇది 18.1 బిహెచ్‌పి పవర్, 18.3 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. కంపెనీ దీనిని రూ.3.3 లక్షల ఎక్స్ షోరూమ్ ధరతో లాంచ్ చేసింది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు