ఐఫోన్ అంటే అందరికీ ఇష్టమే. ధర ఎంతున్నా కొనేందుకు కొందరు వెనకడుగు వేయరు. అధునాతన ఫీచర్లు, అద్భుతమైన కెమెరా క్వాలిటీ సహా మరెన్నో ఐఫోన్‌పై ఆసక్తిని పెంచేశాయి. ఇప్పటి వరకు ప్రముఖ అమెరికన్ ఫోన్ల తయారీ కంపెనీ యాపిల్ 16 సిరీస్‌లను తీసుకొచ్చింది. మార్కెట్‌లోకి వచ్చిన ప్రతి ఐఫోన్ సిరీస్ అద్భుతమైన రెస్పాన్స్‌ను అందుకుంది. ఫోన్ క్వాలిటీ, డిజైన్ పరంగా అందిరినీ అట్రాక్ట్ చేసింది.
Also Read : అన్న కోసం చాలా చేశా.. జగన్ నాకోసం ఏమీ చేయలేదు.. షర్మిల కంటతడి
ఏడాదికో సిరీస్ లాంచ్ చేస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించకుంది యాపిల్ కంపెనీ. ఈ ఏడాది ఐఫోన్ 16 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ సిరీస్ మునుపటి మోడళ్లకు భిన్నంగా ఉంది. ఇక ధర కూడా భారీ స్థాయిలో ఉంది. అయినా కొనేందుకు కొందరు వెనక్కి తగ్గడం లేదు. అయితే యాపిల్ కంపెనీ త్వరలో మరో ఫోన్‌ను విడుదల చేసేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది.
Also Read : అలా చేస్తే వచ్చే పాపులారిటీ అక్కర్లేదు.. వైరలవుతున్న సాయి పల్లవి కామెంట్స్
iPhone SE4
iPhone SE4 ఫోన్‌ను రిలీజ్ చేసేందుకు యాపిల్ కంపెనీ సన్నాహాలు చేస్తుంది. కాగా iPhone SE ఫోన్‌ను కంపెనీ 2022లో లాంచ్ చేయగా.. ఇప్పుడు దానికి సక్సెసర్‌గా iPhone SE4ను విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. దీనిని కంపెనీ ఈ ఏడాది డిసెంబర్ నాటికి సుమారు 8.6 మిలియన్ యూనిట్లు (8.60 లక్షల) iPhone SE4 ఫోన్‌ల ఉత్పత్తిని ప్రారంభించేందుకు లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read : మా ఎమ్మెల్యేలకు ఎన్సీపీలో చేరాలని రూ. కోట్లు ఆఫర్ చేశారు: కాంగ్రెస్
అయితే ఈ ఉత్పత్తి 2024 డిసెంబర్ నుంచి 2025 ఏప్రిల్ వరకు ఉంటుందని సమాచారం. ఇక iPhone SE4 ఫోన్ స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. ఈ ఫోన్ 6.06 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. కెమెరా విషయానికొస్తే..
Also Read: Canada వెళ్లి చదువుకోవాలనుకునేవారు జాగ్రత్త.. భారత దౌత్యవేత్త సంచలన వ్యాఖ్యలు
ఇందులో 48ఎంపీ కెమెరాను అమర్చినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ ఫోన్‌లో అదనంగా 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌కు మద్దతిచ్చే ఓఎల్‌ఈడీ ప్యానెల్ ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు. అలాగే ఈ ఫోన్ ఏ18 బయోనిక్ చిప్‌తో వస్తుందని తెలుస్తోంది.