/rtv/media/media_files/8QCEUhL6SHJqpa1NPcak.jpg)
JOBS: నిరుద్యోగులకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ గుడ్ న్యూస్ చెప్పింది. అప్రెంటిస్ నియామకం కోసం 750 పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టు 8న ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ.. ఈరోజుతో ముగుస్తుంది. ఇంకా అప్లై చేసుకొని వెంటనే అప్లై చేసుకోండి. దరఖాస్తు చేసుకోవడానికి అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ iob.in లేదా bfsissc.comని సందర్శించండి. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా సబ్జెక్టులో డిగ్రీని కలిగి ఉండాలి.
𝐈𝐧𝐝𝐢𝐚𝐧 𝐎𝐯𝐞𝐫𝐬𝐞𝐚𝐬 𝐁𝐚𝐧𝐤 𝐢𝐬 𝐡𝐢𝐫𝐢𝐧𝐠 𝟕𝟓𝟎 𝐀𝐩𝐩𝐫𝐞𝐧𝐭𝐢𝐜𝐞𝐬!
— Ap Dsc updates (@ApDsc) August 12, 2025
View Notification :https://t.co/eJe8mlY96V
Visit the Official Website :https://t.co/gQseJAnCs1#apdsc#bankjobs#iobjobs#apdscupdates#bank2025pic.twitter.com/VvCPeH4D5j
అర్హతలు
- దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా సబ్జెక్టులో డిగ్రీని కలిగి ఉండాలి.
- అభ్యర్థుల వయస్సు 20 - 28 సంవత్సరాలు ఉండాలని నోటిఫికేషన్ పేర్కొంది.
- రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
- అభ్యర్థుల వయస్సు 2025 ఆగస్టు 1 నాటికి లెక్కించబడుతుంది.
జాబ్ వివరాలు
ఆన్ లైన్ పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పరీక్షల్లో మొత్తం 100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉండగా.. వీటిని పూర్తి చేసేందుకు 90 నిమిషాల సమయం ఇస్తారు. అయితే తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కింగ్ ఉండదు. జాబ్ లో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 12 నెలల పాటు శిక్షణ కాలం ఉంటుంది. ఈ శిక్షణ సమయంలో మెట్రో ప్రాంతాల్లో నివసించే అభ్యర్థులకు రూ.15,000 స్టైఫండ్, అలాగే పట్టాణ ప్రాంతాల్లో ఉండే అభ్యర్థులకు రూ. 12000 స్టైఫండ్ ఇవ్వబడుతుంది.
ధరఖాస్తు విధానం ..
- ముందుగా అధికారిక వెబ్‌సైట్ bfsissc.com ని వెళ్ళండి
- ఆ తర్వాత హోమ్ పేజీలో ఇవ్వబడిన కెరీర్ లింక్‌పై క్లిక్ చేయాలి.
- దీని తర్వాత రిక్రూట్‌మెంట్ సంబంధిత లింక్‌పై క్లిక్ చేయండి.
- రిక్రూట్‌మెంట్ లింక్ పై క్లిక్ చేసిన తర్వాత 'న్యూ రిజిస్ట్రేషన్' అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. అక్కడ మీ వివరాలతో రిజిస్టర్ అవ్వండి.
- రిజిస్ట్రేషన్ తర్వాత అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి.
- అన్ని వివరాలు, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ ఫార్మ్ ని సబ్మిట్ చేయండి.
- అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఆ కాపీని డౌన్‌లోడ్ చేసి ప్రింటవుట్ తీసుకోండి.
- అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక నోటిఫికేషన్‌లో అర్హత విద్యా అర్హతను తనిఖీ చేసుకోవాలి.
Also Read: Naukri Survey: నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. ఈ టెక్నాలజీలు నేర్చుకుంటే జాబ్ గ్యారెంటీ!