Budget 2024: మాల్దీవులకు తక్కువ..భూటాన్‌కు ఎక్కువ...ఈ ఏడాది బడ్జెట్ కేటాయింపులు పొరుగుదేశాలతో బంధాలను బలోపేతం చేసుకునేందుకు భారత్ అడుగులు వేస్తోంది. పొరుగుకే తొలి ప్రాధాన్యం విధానం కింద భారత్ పక్క దేశాలకు అభివృద్ధి సాయం అందిస్తోంది. ఇందులో భాగంగా తాజా బడ్జెట్ లో భారత ప్రభుత్వం పలు కేటాయింపులు జరిపింది. అ్యధికంగా భూటాన్‌కు రెండువేల కోట్లను కేటాయించారు. By Manogna alamuru 24 Jul 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Neighboring Countries Budget : పొరుగు దేశాలను పైకి తీసుకురావాలని డిసైడ్ అయింది కేంద్ర ప్రభుత్వం. ఈ క్రమంలో 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను విదేశీ వ్యవహారాల శాఖకు రూ.22,154 కోట్లు కేటాయించింది. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లోనూ దాదాపు ఇవే కేటాయింపులు ఉన్నాయి. అయితే ఇందులో కొన్ని మార్పులు-చేర్పులూ చేసింది. ఈ క్రమంలో మాల్దీవులకు కేటాయింపులు తగ్గించి భూటాన్‌కు ఎక్కువ చేసింది. గతేడాది మాల్దీవులకు రూ.770కోట్లను కేటాయించగా ఈసారి రూ.400 కోట్ల ఖర్చుకు పరిమితం చేసింది. కానీ భూటాన్‌కు మాత్రం రూ.2068 కోట్లను ఇచ్చింది. ఇక మిగతా పొరుగు దేశాలైన నేపాల్‌కు రూ.700 కోట్లను ప్రభుత్వం కేటాయించగా.. శ్రీలంక కోసం రూ.245 కోట్లను తీసి పెట్టింది. గతేడాది శ్రీలంకకు కేంద్రం కేవలం రూ.60 కోట్లు మాత్రమే ఇచ్చింది. అలాగే ఇరాన్‌తో అనుసంధాన ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టిన కేంద్రం ఆ దేశంలోని చాబహార్ పోర్టు నిర్వహణకు రూ.100 కోట్లను ప్రకటించింది. అఫ్గాన్‌కు రూ.200 కోట్లను.. బంగ్లాదేశ్‌కు రూ.120 కోట్లు, మయన్మార్‌లో రూ.250కోట్లు ఖర్చు చేస్తామని చెప్పారు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. Also Read:Budget 2024: రక్షణ బడ్జెట్ రూ. 6.21 లక్షల కోట్లు #budget-2024 #neighboring-countries #india మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి