Vijayawada : బుడమేరుకు ఏ క్షణమైనా వరద!

భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో ఏ క్షణంలోనైనా బుడమేరుకు ఆకస్మిక వరదలు రావొచ్చని విజయవాడ నీటిపారుదల విభాగం ఎస్‌ఈ ఆదివారం అర్ధరాత్రి తెలిపారు.ఇప్పటికే నీటిమట్టం ఓ అడుగు పెరిగిందని తెలిపారు.

Vijayawada : బుడమేరు
New Update

Budameru Flood Alert : బుడమేరు పరివాహక ప్రాంతంలో నిరంరాయంగా వానలు పడుతుండటంతో పాటు, భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయనే వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో ఏ క్షణంలోనైనా బుడమేరు (Budameru) కు ఆకస్మిక వరదలు రావొచ్చని విజయవాడ (Vijayawada) నీటిపారుదల విభాగం ఎస్‌ఈ ఆదివారం అర్ధరాత్రి తెలిపారు.

వెలగలేరు రెగ్యులేటర్‌ వద్ద ప్రస్తుతం 2.7 అడుగుల నీటి మట్టం ఉందని, అది 7 అడుగులకు చేరినప్పుడు రెగ్యులేటర్ నుంచి నీరు విడుదల చేస్తామని తెలిపారు. ఇప్పటికే నీటిమట్టం ఓ అడుగు పెరిగిందని తెలిపారు. గండ్ల పూడ్చివేత, కట్టల బలోపేతం పనులు వేగంగా కొనసాగుతున్నాయని అధికారులు వివరించారు.

లోతట్టున ఉన్న ఏలప్రోలు, రాయనపాడు, గొల్లపూడి, జక్కంపూడి కాలనీ, అజిత్‌ సింగ్‌ నగర్‌, గుణదల, రామవరప్పాడు వంటి ప్రాంతాలు ముంపు బారిన పడే అవకాశం ఉందని.. వెంటనే ఆ ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేయాలని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను కోరారు.

Also Read : రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు..ఈ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌!

#floods #vijayawada-floods #andhra-pradesh-floods #budameru
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe