Vijayawada : బుడమేరుకు ఏ క్షణమైనా వరద!
భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో ఏ క్షణంలోనైనా బుడమేరుకు ఆకస్మిక వరదలు రావొచ్చని విజయవాడ నీటిపారుదల విభాగం ఎస్ఈ ఆదివారం అర్ధరాత్రి తెలిపారు.ఇప్పటికే నీటిమట్టం ఓ అడుగు పెరిగిందని తెలిపారు.
భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో ఏ క్షణంలోనైనా బుడమేరుకు ఆకస్మిక వరదలు రావొచ్చని విజయవాడ నీటిపారుదల విభాగం ఎస్ఈ ఆదివారం అర్ధరాత్రి తెలిపారు.ఇప్పటికే నీటిమట్టం ఓ అడుగు పెరిగిందని తెలిపారు.
AP: బుడమేరు గండ్ల పూడ్చివేత పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. చెన్నై, సికింద్రాబాద్ రెజిమెంటల్ ఆర్మీ జవాన్లు ఈ పూడ్చివేతలో పాల్గొంటున్నారు. పూడ్చివేత పనులు దాదాపు అయిపోయినట్లు తెలుస్తోంది. బుడమేరు వాగుకు గండ్లు పడడంతో విజయవాడ నీటమునిగిన విషయం తెలిసిందే.
బుడమేరుకు పడిన మూడు గండ్లను పూడ్చేందుకు గత నాలుగు రోజుల నుంచి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గండ్లను పూడ్చేందుకు ఆర్మీ ఇంజనీర్ల బృందం కూడా రంగంలోకి వచ్చింది. ప్రస్తుతం పనులు నిర్వహిస్తున్న ఏజెన్సీతో కలిసి ఆర్మీ బృందం బుడమేరు గండ్లు పూడ్చే పనుల్లో నిమగమైంది.
విజయవాడ బుడమేరు వరద నీరు అంతా కొల్లేరులోకి చేరుతుండడంతో కొల్లేరు ఉద్ధృతంగా ప్రవాహిస్తుంది. దీంతో కైకలూరు-ఏలూరు రహదారి పై రాకపోకలు నిలిచిపోయాయి. కొల్లేరును దాటే ప్రయత్నం ఎవరూ చేయోద్దని పోలీసు వారు హెచ్చరికలు జారీ చేశారు.
బుడమేరు నుంచి వరద నీరు ఇప్పుడు కొల్లేరువైపు వెళుతోంది. ఇప్పటికే కొల్లేరుకు వెళ్లే రహదారుల పై నీరు వచ్చి చేరుతోంది. విజయవాడ తరువాత బుడమేరు కొల్లేరు ప్రాంతాన్ని చుట్టుముట్టే అవకాశం ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో కొల్లేరు గురించి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు.
విజయవాడలో బుధవారం రాత్రి మరోసారి భారీ వర్షం కురిసింది. గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో ప్రజలు మళ్లీ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బుడమేటి వరద నిలకడగా ఉండగా, ఎగువ ప్రాంతాల నుంచి వరద వస్తే ఆందోళనకర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.