Bubblegum Trailer : రోషన్ కనకాల 'బబుల్ గమ్' ట్రైలర్ వచ్చేసింది

స్టార్ సుమ కుమారుడు రోషన్ కనకాల హీరోగా రాబోతున్న మొదటి చిత్రం "బబుల్ గమ్". ఈ సినిమా డిసెంబర్ 29న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృదం మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ యువతను ఆకట్టుకునేలా సాగింది.

Bubblegum Trailer : రోషన్ కనకాల 'బబుల్ గమ్' ట్రైలర్ వచ్చేసింది
New Update

 Bubblegum: టాలీవుడ్ యాంకర్ సుమ కనకాల(Suma Kanakala) నటుడు రాజీవ్ కనకాల కుమారుడు రోషన్ హీరోగా లాంచ్ అవుతున్న సంగతి తెలిసిందే. రోషన్ హీరోగా నటిస్తున్న తొలి చిత్రం 'బబుల్ గమ్'(Bubble Gum). ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ ను హీరో నాని రిలీజ్ చేశారు. ఈ సినిమాను డిసెంబర్ 29 న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మూవీ బృందం. ఈ ట్రైలర్ యువతను ఆకట్టుకునేలా ఉంది. ప్రియురాలి కారణంగా అవమానాలను ఎదుర్కున్న అబ్బాయి.. తన జీవితంలో ఎలా ముందు వెళ్తాడు.. ఏ విధంగా ప్రియురాలి పై రివెంజ్ తీర్చుకున్నాడు అనే ఆసక్తికర అంశాలతో సాగింది. ట్రైలర్ విడుదలైన 8 గంటల్లోనే సోషల్ మీడియాలో టాప్ 4 ట్రెండింగ్ గా వ్యూస్ సాధించింది.

Also Read: JioTV Premium Plans : జియోటీవీ యూజర్లకు గుడ్ న్యూస్.. సింగిల్ సబ్‌స్క్రిప్షన్‌ తో 14 ఓటీటీలు..! పూర్తి వివరాలివే..

'బబుల్ గమ్' సినిమాకు రవికాంత్ పెరుపు దర్శకత్వం వహించారు. మహేశ్వరి మూవీస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(People Media Factory) బ్యానర్ పై నిర్మిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రెండు పాటలు సోషల్ మీడియాలో మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఈ చిత్రంలో రోషన్ కనకాల సరసన మానస చౌదరి కథానాయికగా నటిస్తోంది. మానస చౌదరి కూడా ఇదే తొలి సినిమా హర్ష చెముడు, అనన్య ఆకుల, కిరణ్ మచ్చ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

Also Read: Tollywood Celebrities Deaths : చంద్రమోహన్, విశ్వనాథ్ తో పాటు 2023లో కన్నుమూసిన సినీ ప్రముఖులు వీరే!

#suma-kanakala #roshan-kanakala #rajiv-kanakala #bubble-gum-trailer
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe