AbuDhabi Hindu Temple:అబుదాబిలో హిందూ దేవాలయానికి భక్తుల తాకిడి..మొదటిరోజు ఎంత మంది దర్శించుకున్నారంటే? అబుదాబిలోని హిందూ దేవాలయానికి భక్తుల తాకిడి మొదలైంది. ఆదివారం 65వేల మందికిపైగా భక్తులు దర్శించుకున్నారు. ఫిబ్రవరి 14న ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఆలయాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే . 27 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 700 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ఆలయాన్ని నిర్మించారు. By Bhoomi 03 Mar 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి AbuDhabi Hindu Temple: అబుదాబిలో మొదటి హిందూదేవాలయంలో సామాన్య భక్తులకు ప్రవేశం కల్పించారు. దీంతో మొదటి రోజు భక్తుల తాకిడి నెలకొంది. మొదటి రోజు 65వేలకు పైగా భక్తులు దర్శించుకున్నారు. ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్ర మోదీ అబుదాబిలో తొలి హిందూ దేవాలయాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ఆలయాన్ని మార్చి 3, సాధారణ భక్తుల కోసం అనుమతించారు. తొలిరోజే 65 వేల మందికి పైగా భక్తులు ఆలయాన్ని దర్శించుకునేందుకు తరలివచ్చారు. ఈ క్రమంలో ఉదయం షిఫ్టులో సుమారు 40 వేల మంది భక్తులు, సాయంత్రానికి 25 వేల మందికి పైగా ఆలయాన్ని దర్శించుకున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. అబుదాబి ఆలయాన్ని సందర్శించిన ఒక భక్తుడు మాట్లాడుతూ..“వేలాది మంది ప్రజల మధ్య ఇంత అద్భుతమైన దేవాలయాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తుందని, ప్రశాంతంగా దర్శనం చేసుకోలేమని ఆందోళన చెందాను, కానీ అద్భుతమైన దర్శనం చేసుకుని ఎంతో సంతృప్తి చెందాం. BAPS వాలంటీర్లు, ఆలయ సిబ్బంది అందరికీ వందనాలు. లండన్‌కు చెందిన ప్రవీణా షా, అబుదాబిలోని BAPS హిందూ దేవాలయానికి తన మొదటి సందర్శన గురించి తన అనుభవాన్ని వివరిస్తూ, “నేను వికలాంగుడిని, వేలాది మంది సందర్శకులు ఉన్నప్పటికీ, సిబ్బంది చూపిన శ్రద్ధ చాలా గొప్పది. ప్రజల గుంపులు శాంతియుతంగా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్లడాన్ని నేను చూడగలిగాను అంటూ చెప్పుకొచ్చారు. తొలి హిందూ దేవాలయానికి భక్తుల తాకిడి మొదలవ్వడంతో..ఆలయం భక్తులతో కిటకిటాలాడుతుంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. Over 40,000 people visit the BAPS Hindu Temple in Abu Dhabi. The temple was inaugurated on Feb 14 in the presence of Prime Minister Narendra Modi. pic.twitter.com/mBO2z4GAJW — IANS (@ians_india) March 3, 2024 ఇది కూడా చదవండి: నేను రాజీనామా చేస్తున్నా…హైకోర్టు జడ్జి సంచలన నిర్ణయం..! #uae #abu-dhabi #narendra-modi #hindu-temple మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి