TSPSC: రేవంత్ ఇది కరెక్టు కాదు.. సీబీఐని ఆశ్రయిస్తానంటున్న ఆర్ఎస్ పీ

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డికి కీలక సూచనలు చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అన్యాయాలను ఈ ప్రభుత్వంలో పునరావృతం కాకుండా చూడాలని కోరారు. టీఎస్పీఎస్సీ కొత్త కమిషన్‌ లో తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

New Update
TSPSC: రేవంత్ ఇది కరెక్టు కాదు.. సీబీఐని ఆశ్రయిస్తానంటున్న ఆర్ఎస్ పీ

RS Praveen Kumar: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ (RS ​​Praveen) కుమార్ కీలక సూచనలు చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అన్యాయాలను బయటకు తీసి నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా TSPSC ఛైర్మన్, సభ్యులు ఘోరమైన తప్పిదాలపై రేవంత్ సర్కార్ సీరియస్ గా చర్యలు తీసుకోవాలని కోరారు.

టీఎస్పీఎస్సీ కొత్త కమిషన్‌..
అలాగే ఇటీవల ఏర్పడిన టీఎస్పీఎస్సీ కొత్త కమిషన్‌ లో తప్పులు జరగకుండ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గతంలో జరిగిన తప్పులపై విచారణ తప్పకుండా జరపాల్సిన అవసరం ఉందని, లేకపోతే తాము సీబీఐని (CBI) ఆశ్రయిస్తామని హెచ్చరించారు. ఇక గ్రూప్‌ -1 కొత్త నోటిఫికేషన్‌ ఇవ్వాలని, TSPSCలో చాలా పోస్టులు అపరిష్కృతంగా ఉన్నాయని గుర్తు చేశారు.

యూనివర్సిటీలో హైకోర్టుపై..
ఇక హైకోర్టును తరలించడంలో తప్పు లేదన్న ఆయన.. కానీ హైకోర్టును అగ్రికల్చర్‌ యూనివర్సిటీలో పెట్టడం సరికాదని తన అభిప్రాయం వెల్లడించారు. వర్శిటీలో ఎన్నో గొప్ప వృక్షాలను ప్రొటెక్ట్ చేస్తున్నారని, అలాంటి సమయంలో ప్రకృతిని ద్వంస చేయకూడదని, హైకోర్టును ఎక్కడైనా కట్టాలని సూచించారు. అలాగే ఆటో డ్రైవర్లను (Auto Drivers) ఆదుకునే స్పష్టమైన నిర్ణయం ప్రభుత్వం దగ్గర లేదని చెప్పిన ప్రవీణ్.. చాలా శాఖలకు మంత్రులు లేరని వీలైనంత త్వరగా దీనిపై చర్యలు తీసుకోవాలన్నారు.

ఇది కూడా చదవండి: Dindukkal: అమానుషం.. నిండు గర్భిణిని బస్సులో నుంచి తోసేసిన భర్త

బెల్టు షాపుల రద్దు..
ఇక రాష్ట్రంలో బెల్టు షాపులు రద్దు చేస్తామని చెప్పినప్పటికీ ఎక్కడ అవి మూతపడినట్లు కనిపించట్లేదన్నారు. ఇక దళితబంధు స్థానంలో ఏం తీసుకువస్తారని ప్రశ్నించిన ఆయన.. కబ్జాకు గురైన భూములను తిరిగి స్వాధీన పరుచుకోవాలని కోరారు. 'అసైన్డ్ భూములకు రెగ్యూలర్ పట్టాలు ఇవ్వాలి. రెండు నెలలైనా కొత్త ప్రభుత్వమని పాత పాట పాడడం సరికాదు. దేశంలో రాజ్యాంగం ప్రమాదంలో ఉంది. ముస్లింలు భయాందోళనలో ఉన్నారు'అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Advertisment
తాజా కథనాలు