Neelam Madhu Joined in Congress: లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీకి (Congress Party) బలం చేకూరుతుంది. ఇతర పార్టీల నుంచి నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. తాజాగా తెలంగాణలో బీఎస్పీ (BSP) పార్టీకి షాక్ తగిలింది. బీఎస్పీకి రాజీనామా చేశారు పఠాన్ చేరు నేత నీలం మధు. ఈ రోజు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా దీపాదాస్ మున్షీ (Deepa Dasmunsi) ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే.. నీలం మధుకు కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ALSO READ: పెన్షన్లలో కేసీఆర్ సర్కార్ అవినీతి.. కాగ్ సంచలన రిపోర్ట్
కాంగ్రెస్ చేరడం ఇది రెండో సారి..
పఠాన్ చేరులో (Patancheru) బలమైన నేతగా గుర్తింపు తెచ్చుకున్న నీలం మధు కాంగ్రెస్ పార్టీలో చేరడం ఇది రెండోసారి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఆయన.. పఠాన్ చేరు టికెట్ తనకు కాకుండా గూడెం మహిపాల్ రెడ్డికి ఇవ్వడంతో బీఆర్ఎస్ పార్టీకి (BRS Party) రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. అయితే.. ఎమ్మెల్యే టికెట్ హామీతో కాంగ్రెస్ లో చేరిన నీలం మధు హస్తం పార్టీ హ్యాండ్ ఇచ్చింది. అతనికి కాకుండా వేరే వారికి కేటాయించింది. దీంతో అలిగిన నీలం మధు బీఎస్పీ పార్టీలో చేరి ఆ పార్టీ బీఫామ్ మీద ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే.. తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కొలువుదీరడంతో మరోసారి కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే.. ఈసారి తనకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ (MP Ticket) ఇస్తుందనే ఆశతో నీలం మధు ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఎంపీ టికెట్ రాకపోతే మరోసారి కాంగ్రెస్ పార్టీకి నీలం మధు రాజీనామా చేస్తారా? అనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో జోరందుకుంది.
రేవంత్ తో భేటీ గతంలోనే ప్రకటన
కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం మేరకు కార్యకర్తల ఆధ్వర్యంలో ఈ నెల 15 న కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు నీలం మధు గతంలో ప్రకటించారు. అంతకు ముందు బీఎస్పీ పార్టీకి రాజీనామా లేఖను సమర్పించారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో గుర్తించి పార్టీ టిక్కెట్ కేటాయించినందుకు బీఎస్పీ నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తన వెంట నడుస్తున్న నాయకులు, కార్యకర్తల సలహా మేరకు కాంగ్రెస్ పార్టీ లో చేరాలని డిసైడ్ అయినట్లు ఆయన పేర్కొన్నారు. సోమవారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో కార్యకర్తలంతా కాంగ్రెస్‌లో చేరాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం మేరకు ప్రజల సంక్షేమం కోసం ప్రజా పాలనలో తాము సైతం భాగస్వాములు కావడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈనెల 15న తన వెంట నడుస్తున్న నాయకులు, కార్యకర్తలు, ఎన్ఎంఆర్ యువసేన సభ్యులతో కలిసి గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దీప్ దాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నట్లు వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలతో (Congress Six Guarantees) అన్ని వర్గాల ప్రజలకు, ప్రతి ఇంటికి సంక్షేమం, సమన్యాయం జరుగుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చేరి అందరితో కలుపుగోలుగా ఉంటూ కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. తనకు కాంగ్రెస్ పార్టీకి సేవ చేసే అవకాశం కల్పించిన ఏఐసీసీ అధినాయకత్వంతో పాటు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల కనుగుణంగా పనిచేస్తూ పార్టీ అభివృద్ధికి తనవంతుగా పాటుపడతానని మధు చెప్పుకొచ్చారు.
DO WATCH: