Mayawati: ఆర్‌ఎస్ ప్రవీణ్‌కు బిగ్ షాక్.. బీఆర్ఎస్‌తో పొత్తు కట్?

ఆర్‌ఎస్ ప్రవీణ్‌కు షాక్ తగిలింది. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌-బీఎస్పీ కలిసి పోటీ చేయనున్నట్లు కేసీఆర్ ప్రకటించగా.. తాజాగా పొత్తులపై బీఎస్పీ చీఫ్ మాయావతి సంచలన ప్రకటన చేశారు. బీఎస్పీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదని తేల్చి చెప్పారు. ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు చెప్పారు.

New Update
Mayawati: ఆర్‌ఎస్ ప్రవీణ్‌కు బిగ్ షాక్.. బీఆర్ఎస్‌తో పొత్తు కట్?

Mayawati: లోక్ సభ ఎన్నికల వేళ మాజీ సీఎం కేసీఆర్ కు మరో షాక్ తగిలింది. ఇటీవల రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఎస్పీ తో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా పొత్తులపై బీఎస్పీ అధినేత్రి మాయావతి సంచలన ప్రకటన చేసింది. లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే బీఎస్పీ పోటీ చేయనున్నట్లు తేల్చి చెప్పారు. ఇండియా కూటమి, ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోబోమని స్పష్టం చేశారు. కూటమి, థర్డ్‌ ఫ్రంట్‌ అంటూ కొందరు కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కు షాక్?

ఇటీవల కేసీఆర్‌తో బీఎస్పీ తెలంగాణ చీఫ్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ భేటి అయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ - బీఎస్పీ కలిసి పోటీ చేస్తాయని ఇరు పార్టీ నేతలు ప్రకటన కూడా చేశారు. తాజాగా మాయావతి ట్వీట్‌తో బీఆర్‌ఎస్‌ - బీఎస్పీ పొత్తుపై రాష్ట్ర రాజకీయాల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి. మాయావతి అనుమతి తీసుకోకుండానే బీఆర్‌ఎస్‌తో ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ పొత్తు ప్రకటన చేశారా..?, తెలంగాణలో బీఅర్‌ఎస్‌ - బీఎస్పీ పొత్తు ఉంటుందా..? లేదా..? అని చర్చ రాష్ట్ర రాజకీయాల్లో మొదలైంది.

ఉమ్మడి ఎంపీ అభ్యర్థి అనుకున్నారు..!

రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీఎస్పీ కలిసి పోటీ చేయనున్నట్లు ప్రకటించిన కేసీఆర్, ప్రవీణ్ కుమార్ కు మాయావతో చేసిన ట్వీట్ తలనొప్పిగా మారింది. అయితే.. ఎంపీ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ బీఎస్పీ ఉమ్మడి అభ్యర్థిగా ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ పోటీ చేయాలని భావించారు. నాగర్ కర్నూల్ నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఎంపీ అభ్యర్థికి లేకపోవడంతో కేసీఆర్ కూడా దీనికి సరే అన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ నుంచి బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ మూడో స్థానానికి పరిమితం అయ్యారు. అయితే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో పార్లమెంట్ లో అడుగు పెడుదాం అనుకున్న ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ కు మాయావతి చేసిన ట్వీట్ అడ్డంకులను తెచ్చింది. మరి రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు ఉంటుందా? లేదా? అనేది వేచి చూడాలి. కోటి ఆశలతో ఉన్న ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ కు నిరాశే మిగులుతుందా? అనేది తెలియాల్సి ఉంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు