BSNL Network: Jio, Airtelకు బిగ్‌ షాక్.. BSNLకు మారిన లక్ష మంది యూజర్లు..!

ఇటీవల జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా(VI) టెలికాం కంపెనీలు రీఛార్జి ప్లాన్లు పెంచాయి. దీంతో ఏపీలో గత 23 రోజుల్లోనే BSNLకు లక్ష మంది యూజర్లు వచ్చారని.. BSNL ఏపీ సర్కిల్‌ వెల్లడించింది. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా BSNL 4G నెట్‌వర్క్‌ అందుబాటులోకి తీసుకురానుంది.

New Update
BSNL Network: Jio, Airtelకు బిగ్‌ షాక్.. BSNLకు మారిన లక్ష మంది యూజర్లు..!

1 Lakh Users Port to BSNL: ఇటీవల జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా(VI) టెలికాం కంపెనీలు రీఛార్జి ప్లాన్ల ధరలు భారీగా పెంచిన సంగతి తెలిసిందే. మొబైల్ టారిఫ్ ధరలు 15 శాతం పెంచుతున్నట్లు ఈ ప్రైవేట్ టెలికాం నెట్‌వర్క్ సంస్థలు ప్రకటించాయి. దీంతో మొబైల్ ఫోన్ వినియోగదారుల దృష్టి BSNL వైపు మళ్లింది. అంతేకాదు BSNL కూడా మంచి ఆఫర్లతో ముందుకు వచ్చింది. గత 23 రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ పరిధిలోనే లక్ష BSNL సిమ్స్‌ యాక్టివేషన్ అయ్యాయి. కొందరు కొత్త నెట్‌వర్క్‌ కనెక్షన్ తీసుకుంటున్నారు.

Also Read: ఢిల్లీ కోచింగ్ సెంటర్ ఘటన.. ప్రమాదానికి ముందు విజువల్స్‌

మరికొంతమంది జియో (JIO), ఎయిర్‌టెల్ (Airtel), వీఐ నుంచి BSNLకు మారిపోయారు. ఇతర ప్రైవేటు కంపెనీలతో పోల్చితే BSNL చాలా తక్కువ రీఛార్జి ఆఫర్లు ఉన్నాయి. ఈ ఏడాది మేలో ఏపీలోని చిత్తురు జిల్లాలో బీఎస్ఎన్‌ఎల్ 4జీ సర్వీస్‌ను ప్రారంభించింది. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానుంది. కేవలం 23 రోజుల్లోనే BSNLకు లక్ష మంది యూజర్లు వచ్చారని.. BSNL ఏపీ సర్కిల్‌ ఎక్స్ వేదికగా వెల్లడించింది. అయితే వీళ్లు నేరుగా యాక్టివేట్ చేసుకున్నారా లేదా అదే నంబర్‌తో పోర్టబిలిటీ ద్వారా మారారా అనే దానిపై మాత్రం BSNL క్లారిటీ ఇవ్వలేదు. ఒకవేళ మీరు కూడా BSNLకు మారాలనుకుంటే అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

Also Read: 88 మంది బంగ్లాదేశ్ అక్రమ వలసదారుల అరెస్ట్!

BSNL పోర్టబిలిటీ ప్రక్రియ

1. ముందుగా పోర్ట్‌ పార్మట్‌ కోసం 1900కి మెసేజ్‌ పంపాలి. PORT పది అంకెల మీ మొబైల్ నెంబర్‌ను 1900కి మెసేజ్ పంపాలి. పోర్ట్‌ మెసేజ్ పంపిన తర్వాత BSNLకి మారేందుకు 15 రోజుల సమయం పడుతుంది.
2. మొబైల్ నంబర్‌ పోర్టింగ్‌ను అభ్యర్థించేందుకు BSNL CSC (కస్టమర్ సర్వీస్ సెంటర్) రిటైలర్‌ను సంప్రదించి BSNL ఆఫీస్ కు వెళ్లాలి.
3. కస్టమర్ అప్లికేషన్‌ ఫారమ్‌ (CAF)ను ఫిల్ చేయాలి
4. ఆ తర్వాత మీకు కొత్త BSNL సిమ్ కార్డు వస్తుంది. మీ పోర్టింగ్ అభ్యర్థన ఆమోదించిన తర్వాత.. ఏరోజు మీ సిమ్ యాక్టివేట్ అవుతుందో అనే సమాచారం వస్తుంది. అప్పటినుంచి మీరు BSNL నెట్‌వర్క్‌కు పూర్తిగా మారిపోతారు.
5. ఏదైనా సమస్యలు ఉంటే.. టోల్‌ ఫ్రీ నెంబర్ 1800-180-1503 లేదా 1503కి కాల్ చేయండి

Advertisment
Advertisment
తాజా కథనాలు