BSNL 4G Service: BSNL వాడేవారికి గుడ్‌న్యూస్.. ఆ జిల్లాలో 4G సేవలు

గుంటూరు జిల్లా తాడికొండలో బీఎస్ఎన్ఎల్ 4G సేవలు అందుబాటులోకి వచ్చాయి. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌.. బీఎస్ఎన్ఎల్ 4G సేవలను బీఎస్ఎన్ఎల్ సీఎండీ రాబర్ట్ రవి, ఏపీ చీఫ్ జనరల్ మేనేజర్ శేషాచలంతో కలిసి ప్రారంభించారు.

New Update
BSNL 4G Service: BSNL వాడేవారికి గుడ్‌న్యూస్.. ఆ జిల్లాలో 4G సేవలు

గుంటూరు జిల్లా తాడికొండలో బీఎస్ఎన్ఎల్ 4G సేవలు అందుబాటులోకి వచ్చాయి. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌.. బీఎస్ఎన్ఎల్ 4G సేవలను బీఎస్ఎన్ఎల్ సీఎండీ రాబర్ట్ రవి, ఏపీ చీఫ్ జనరల్ మేనేజర్ శేషాచలంతో ప్రారంభించారు. ఈ విషయాన్ని ఆయన తన ఎక్స్‌ ఖాతాలో పంచుకున్నారు. దేశ వ్యాప్తంగా వచ్చే ఏడాది మార్చిలోగా నూరు‌ శాతం బీఎస్ఎన్ఎల్ 4G సేవలను అందుబాటులోకి తీసుకురాబోతున్నామని తెలిపారు. అలాగే మారుమూల‌ గ్రామాలకు సైతం‌ బీఎస్ఎన్ఎల్ 4G సేవలను విస్తరించడానికి కృషి‌ చేస్తున్నామని పేర్కొన్నారు.

Also Read: మ‌ట్టి మిద్దె కూలి కుటుంబం మృతి.. రూ.10 లక్షల సాయం ప్రకటించిన చంద్రబాబు!

ఇదిలాఉండగా..  ఆగస్టు 15 నుంచి దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో 4జీ సేవలను ప్రారంభించేందుకు బీఎస్ఎన్ఎల్ పనులు ముమ్మరం చేస్తోంది. గ్రామాల్లో కూడా 4జీ సేవలు అందించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారులు 4G సిమ్ కార్డ్‌లకు అప్‌గ్రేడ్ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు 5జీ సిమ్ కార్డులను సైతం అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ 5G సిమ్ కార్డ్‌లు ఏపీ, తెలంగాణ, కేరళలో అందుబాటులో ఉన్నాయి. 4జీ నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చిన కొద్దికాలంలోనే 5జీ సేవలు కూడా ప్రారంభించే అవకాశం ఉంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు