Yediyurappa: యెడియూరప్పపై పోక్సో కేసు నమోదు.. ఛార్జిషీట్లో సంచలన విషయాలు కర్నాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పపై పోక్సో కేసు నమోదైంది. దీనిపై విచారణ జరిపిన నేర విచారణ సంస్థ (CID).. తన ఛార్జిషీటులో కీలక విషయాలు చేర్చింది. యెడియూరప్ప ఆ బాలికను లైంగికంగా వేధించాడని.. ఆ తర్వాత ఆ బాలికకు, తల్లికి డబ్బులు ఇచ్చినట్లు పేర్కొంది. By B Aravind 28 Jun 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి ఇటీవల కర్నాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పపై లైంగిక ఆరోపణలు రావడం దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఆయనపై తాజాగా పోక్సో కేసు నమోదైంది. దీనిపై విచారణ జరిపిన నేర విచారణ సంస్థ (CID).. తన ఛార్జిషీటులో కీలక విషయాలు చేర్చింది. యెడియూరప్ప ఆ బాలికను లైంగికంగా వేధించాడని.. ఆ తర్వాత ఆ బాలికకు, తల్లికి డబ్బులు ఇచ్చినట్లు పేర్కొంది. ఛార్జీషీటు ప్రకారం.. 'ఆ బాలిక, తల్లి ఇద్దరూ యెడియూప్ప వద్దకు వచ్చినప్పుడు.. ఆయన ఆ బాలిక కుడి చేతిని పట్టుకున్నారు. ఆ తర్వాత ఆమెను మీటింగ్ రూమ్‌లోకి తీసుకెళ్లి డోర్ వేశారు. లోపల.. యెడియూరప్ప ఆమెను రేప్ చేసిన వ్యక్తి గుర్తున్నాడా అని అడిగారు. ఆరున్నరేళ్ల వయసున్న ఆ బాలిక గుర్తున్నట్లు చెప్పడంతో.. ఆయన ఆమెతో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. Also Read: పరీక్ష వివక్షతో కూడినదే.. మా రాష్ట్రాన్ని మినహాయించండి.. స్టాలిన్ దీంతో ఆ బాలిక ఆయన్ని తోసేసి.. తలుపు తెరవాలంటూ అరిచింది. ఆ తర్వాత యెడియూరప్ప ఆ బాలికకు కొంత డబ్బు ఇచ్చి డోర్ లాక్ తీశాడు. అనంతకరం ఆ బాలిక తల్లికి కొంత డబ్బు ఇచ్చారు. ఆమెకు సాయం చేయలేకపోతున్నానని చెప్పి పంపించివేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 20న పరిస్థితి మరో మలుపు తిరిగింది. ఆ బాలిక తల్లి ఆయన్ని కలిసిన వీడియోను ఫేస్బుక్లో అప్లోడ్ చేయడంతో.. దీనికి బదులుగా యెడియూర్ప సహాయకులు ఆ బాలికను, తల్లిని ఆయన ఇంటికి పిలిపించారు. ఆ తర్వాత యెడియూరప్ప ఆమెను ఫెస్బుక్ నుంచి ఫొటోలు, వీడియోలు డిలీట్ చేయమని నచ్చజెప్పాడు. ఆ తర్వాత తన సహాయకులతో ఆ బాలిక తల్లికి రూ.2 లక్షలు అందజేశారని' సీఐడీ ఛార్జిషీట్లో వివరించింది. మరోవైపు యెడియూరప్ప తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. యడ్యూరప్ప పిటిషన్‌పై కర్ణాటక హైకోర్టు విచారణ చేపట్టాల్సి ఉంది. ఇదిలాఉండగా.. ఈ ఏడాది ఫిబ్రవరి 2న ఓ కేసు విషయంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ.. ఓ మహిళ, తన కుమార్తె ఇద్దరూ యెడియూరప్ప నివాసానికి వచ్చారు. అక్కడ తన కూతురుని యెడియూర్ప లైంగికంగా వేధించారని.. ఆ తల్లి సదాశివనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు. ఆ తర్వాత ఈ కేసును సీఐడీకి అప్పగించారు. Also Read: ‘జై సంవిధాన్’ అని చెప్పకూడదా.. స్పీకర్‌పై ప్రియాంక ఆగ్రహం ఈ కేసు విచారణ వేగంగా జరగడం లేదని బాధితురాలి కుటుంబీకులు హైకోర్టులో పిటిషన్ వేశారు. మరోవైపు యెడియూరప్ప కూడా కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. చివరికి గురువారం సాయంత్రం సీఐడీ అధికారులు యెడియూరప్పపై 750 పేజీల ఛార్జ్‌షీట్ వేసి పోక్సో కేసు నమోదు చేశారు. దీంతో తనపై నమోదైన ఈ కేసును కొట్టివేయాలని యెడియూరప్ప హైకోర్టును ఆశ్రయించారు. #cid #telugu-news #bs-yediyurappa #pocso #pocso-act మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి