Priyanka Gandhi: లోక్‌సభలో ప్రమాణస్వీకారం చేసే సందర్భంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi).. జై పాలస్తీనా (Jai Palestine) అని నినాదం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై అధికార పార్టీ సభ్యులు తీవ్రంగా అభ్యంతరం తెలిపారు. మరికొందరు ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే కేరళలోని తిరువనంతపురం నుంచి నాలుగోసారి ఎంపీగా గెలిచిన కాంగ్రెస్ నేత శశిథరూర్ (Shashi Tharoor) గురువారం ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన జై హింద్, జై సంవిధాన్ అని నినాదం చేశారు. దీంతో అక్కడున్న విపక్ష ఎంపీలు కూడా జై సంవిధాన్ (Jai Samvidhan) అని నినాదం చేశారు. దీంతో స్పీకర్ ఓం బిర్లా (Om Birla) దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
పూర్తిగా చదవండి..Lok Sabha Sessions: ‘జై సంవిధాన్’ అని చెప్పకూడదా.. స్పీకర్‌పై ప్రియాంక ఆగ్రహం
లోక్‌సభలో కాంగ్రెస్ నేత శశిథరూర్ జై సంవిధాన్ అని నినాదం చేయడంతో.. దీంతో అక్కడున్న విపక్ష ఎంపీలు కూడా జై సంవిధాన్ అని నినాదం చేశారు. దీంతో స్పీకర్ ఓం బిర్లా దీనిపై అభ్యంతరం వ్యక్తం చెప్పగా కాంగ్రెస్ అధినేత్రి ప్రియాకం గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Translate this News: