Yediyurappa : నేడు పోక్సో కేసులో సీఐడీ విచారణకు యడియూరప్ప

కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ నేత బీఎస్ యడియూరప్ప తనపై నమోదైన పోక్సో కేసుకు సంబంధించి ఈరోజు సీఐడీ ఎదుట హాజరు కానున్నారు. కాగా ఈ కేసులో యడియూరప్పను రెండు వారాలపాటు అరెస్ట్ చేయవద్దని కోర్టు పోలీసులకు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే.

Yediyurappa: పోక్సో కేసులో యడియూరప్పకు కాస్త ఊరట
New Update

Karnataka Ex. CM Yediyurappa : కర్ణాటక (Karnataka) మాజీ సీఎం, బీజేపీ (BJP) నేత బీఎస్ యడియూరప్ప (BS Yediyurappa) తనపై నమోదైన పోక్సో కేసు కు సంబంధించి ఈరోజు సీఐడీ ఎదుట హాజరు కానున్నారు. కాగా ఈ కేసులో యడియూరప్పను రెండు వారాలపాటు అరెస్ట్ చేయవద్దని కోర్టు పోలీసులకు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. సీఐడీ విచారణకు వెళ్లే ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడంపై మండిపడ్డారు.

ఆయన మాట్లాడుతూ.." రాష్ట్ర ప్రజలు ఇప్పటికే అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, పెట్రోల్, డీజిల్ ధరలను (Petrol - Diesel Prices) పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నేరమని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి." అని డిమాండ్ చేశారు.

కోర్టులో భారీ ఊరట..

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పకు ఉపశమనం లభించింది. రెండువారాలపాటు ఎటువంటి చర్యలు తీసుకోరాదని హైకోర్టు (High Court) ఏకసభ్య ధర్మాసనం పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. యడియూరప్పకు వయసు పైబడిందనీ, సహజంగానే ఆరోగ్య సమస్యలు ఉంటాయనీ, అరెస్టు చేసి విచారణ చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈ కేసుపై ఆయన్ని విచారణ చేయవచ్చనీ, కానీ అరెస్టు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. యడియూరప్పకు ఉపశమనం లభించడంతో పార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. కాగా పోక్సో కేసు (POCSO Case) లో యడియూరప్పకు నాన్‌ బెయిలబుల్‌ పోలీసులు వారెంట్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే.

Also Read : పేటీఎం మూవీ టికెట్స్ సర్వీస్ జొమాటో చేతిలోకి..

#yediyurappa #bjp #karnataka #pocso-act
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe