Yediyurappa : నేడు పోక్సో కేసులో సీఐడీ విచారణకు యడియూరప్ప కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ నేత బీఎస్ యడియూరప్ప తనపై నమోదైన పోక్సో కేసుకు సంబంధించి ఈరోజు సీఐడీ ఎదుట హాజరు కానున్నారు. కాగా ఈ కేసులో యడియూరప్పను రెండు వారాలపాటు అరెస్ట్ చేయవద్దని కోర్టు పోలీసులకు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. By V.J Reddy 17 Jun 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Karnataka Ex. CM Yediyurappa : కర్ణాటక (Karnataka) మాజీ సీఎం, బీజేపీ (BJP) నేత బీఎస్ యడియూరప్ప (BS Yediyurappa) తనపై నమోదైన పోక్సో కేసు కు సంబంధించి ఈరోజు సీఐడీ ఎదుట హాజరు కానున్నారు. కాగా ఈ కేసులో యడియూరప్పను రెండు వారాలపాటు అరెస్ట్ చేయవద్దని కోర్టు పోలీసులకు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. సీఐడీ విచారణకు వెళ్లే ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడంపై మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ.." రాష్ట్ర ప్రజలు ఇప్పటికే అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, పెట్రోల్, డీజిల్ ధరలను (Petrol - Diesel Prices) పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నేరమని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి." అని డిమాండ్ చేశారు. Bengaluru | "The people of the state are already facing many problems. People are suffering due to price rise. The decision of the state government to increase the price of petrol and diesel is a crime. The state government should take it back its decision immediately," Former… pic.twitter.com/PZ0ankDfRZ — ANI (@ANI) June 17, 2024 కోర్టులో భారీ ఊరట.. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పకు ఉపశమనం లభించింది. రెండువారాలపాటు ఎటువంటి చర్యలు తీసుకోరాదని హైకోర్టు (High Court) ఏకసభ్య ధర్మాసనం పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. యడియూరప్పకు వయసు పైబడిందనీ, సహజంగానే ఆరోగ్య సమస్యలు ఉంటాయనీ, అరెస్టు చేసి విచారణ చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈ కేసుపై ఆయన్ని విచారణ చేయవచ్చనీ, కానీ అరెస్టు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. యడియూరప్పకు ఉపశమనం లభించడంతో పార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. కాగా పోక్సో కేసు (POCSO Case) లో యడియూరప్పకు నాన్ బెయిలబుల్ పోలీసులు వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. Also Read : పేటీఎం మూవీ టికెట్స్ సర్వీస్ జొమాటో చేతిలోకి.. #bjp #karnataka #yediyurappa #pocso-act మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి