Hyderabad: పేదవాళ్లపై సర్కారు కర్కశం.. హైడ్రా కూల్చివేతలపై కేటీఆర్‌ ఫైర్

రాష్ట్ర ప్రభుత్వం కర్కశంగా పేదల గూడు కూల్చేస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్‌ హయాంలో నిర్మించిన 4 వేల డబుల్‌ బెడ్‌రూం ఇళ్లల్లోకి పేదలను తరలించాలని రాష్ట్ర సీఎస్‌కు విజ్ఞప్తి చేశారు.

Hyderabad: పేదవాళ్లపై సర్కారు కర్కశం.. హైడ్రా కూల్చివేతలపై కేటీఆర్‌ ఫైర్
New Update

హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝళిపిస్తోంది. పార్టీలకతీతంగా, ఎలాంటి బేధాలు లేకుండా ఆక్రమణకు గురైన నిర్మాణాలన్నింటిని కూల్చివేస్తోంది. అయితే ఆదివారం కొందరు పేద, మధ్య తరగతి కుటుంబాలు ఉంటున్న ఇళ్లను కూడా కూల్చడంతో ఉద్రిక్తత నెలకొంది. అయితే దీనిపై తాజాగా బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. సర్కారు కర్కశంగా గూడు కూల్చేస్తే.. దిక్కుతోచక ప్లాస్టిక్ కవర్ల నీడలో అభాగ్యులు తలదాచుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేరుకేమో ప్రజా ప్రభుత్వం, కూల్తేదేమో నిరుపేదల ఇళ్లు అంటూ మండిపడ్డారు.

Also Read: అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తాం: సీఎం రేవంత్

హైదరాబాద్‌లోని పేదలకు బీఆర్ఎస్‌ ప్రభుత్వం 4 వేల డబుల్ బెడ్‌ రూమ్‌ ఇళ్లు నిర్మించిందని తెలిపారు. అవన్నీ కూడా పేదలకు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. వెంటనే ఈ ఇళ్లల్లోకి వారిని తరలించాలని రాష్ట్ర సీఎస్‌కు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి బాధాకరమైన చిత్రాలు చూడలేకపోతున్నామని రాసుకొచ్చారు.

#ktr #telugu-news #telangana #hydra
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe