KTR: కేసీఆర్ ప్రతిపక్షంలో ఉంటే డేంజర్.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధికారంలో ఉండటం కన్నా ప్రతిపక్షంలో ఉండటమే కాంగ్రెస్‌కు ప్రమాదం అని కేటీఆర్ అన్నారు. సీఎం అనే రెండక్షరాల కన్నా కేసీఆర్ అనే మూడు అక్షరాలే పవర్ ఫుల్ అని పేర్కొన్నారు. ఫిబ్రవరిలో కేసీఆర్ ప్రజల మధ్యకు వస్తారని తెలిపారు. By V.J Reddy 09 Jan 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Ex- Minister KTR: మరికొన్ని నెలల్లో లోక్ సభ ఎన్నికలు (Parliament Elections) జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Elections) అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ (BRS Party) వచ్చే లోక్ సభ ఎన్నికలపై నజర్ వేసింది. లోక్ సభ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా తెలంగాణ భవన్ లో వివిధ పార్లమెంట్ నియోజకవర్గాల నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR), హరీష్ రావు (Harish Rao) సమావేశాలు నిర్వహిస్తున్నారు. ALSO READ: ఫార్ములా ఈ-రేస్ అందుకే రద్దు.. మంత్రి భట్టి కీలక వ్యాఖ్యలు ఖమ్మంలో గులాబీ జెండా ఎగరాలే.. ఖమ్మం (Khammam) లోక్ సభ నియోజక వర్గం సన్నాహక సమావేశానికి హజరైన పార్టీ శ్రేణులను ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రసంగించారు. ఖమ్మం వంటి ఒకటి రెండు జిల్లాల్లో తప్పితే ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా తిరస్కరించలేదు అనడానికి మనం సాధించిన అసెంబ్లీ ఫలితాలే నిదర్శనమన్నారు. 39 ఎమ్మెల్యే సీట్లను గెలవడంతో పాటు 11 స్థానాలు అత్యల్ప మెజారిటీతో చేజారిపోయాయన్నారు. ప్రజల్లో ఉన్న అసంతృప్తికి కారణాలు చర్చించుకుని సమీక్షించుకుని ముందుకు సాగుదమన్నారు. ఇప్పటికీ జరిగిన సమావేశాల్లో పార్టీ పరంగా ఆత్మవిమర్శ చేసుకుంటున్నామన్నారు. కేసీఆర్ ప్రతిపక్షంలో ఉంటే డేంజర్.. అధికారంలో ఉన్నప్పటి కన్నా ప్రతిపక్షంలో ఉంటేనే మరింత పోరాట పటిమ చూపగలమని, మనమంతా ఉద్యమంలో గట్టిగా పోరాడిన వాళ్ళమేనని కేటీఆర్ గుర్తు చేశారు. మొన్న అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ పోరాట పటిమను తెలంగాణ ప్రజలు చూశారని, రానున్న రోజుల్లో కేసీఆర్ అసెంబ్లీ కొస్తే ఇంకా ఎలా ఉంటుందో ఊహించుకోవాలన్నారు. కేసీఆర్ అధికారం లో ఉండటం కన్నా ప్రతిపక్షం లో ఉండటమే కాంగ్రెస్ పార్టీకి ప్రమాదకరమని, సీఎం అనే రెండక్షరాల కన్నా కేసీఆర్ అనే మూడు అక్షరాలే పవర్ ఫుల్ అన్నారు. ఫిబ్రవరిలో ప్రజల ముందుకు.. ఫిబ్రవరిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజల మధ్యకు వస్తారని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. పార్లమెంటు నియోజకవర్గాల సమీక్షలు ముగియగానే అసెంబ్లీ నియోజక వర్గాల సమీక్షలు ఉంటాయని, త్వరలోనే రాష్ట్ర ,జిల్లా కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతీ రెండు మూడు నెలలకోసారి అన్ని కమిటీల సమావేశాలు క్రమం తప్పకుండా ఏర్పాటు చేస్తాన్నారు. ALSO READ: జగన్ ఇక మాజీ సీఎం.. KA పాల్ శాపనార్థాలు #ktr #kcr #breaking-news #brs-party #telangana-latest-news #khammam-news #mp-elections మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి