KCR: రాబోయే 15 ఏళ్లు బీఆర్ఎస్‌దే అధికారం.. ఎన్టీఆర్‌కు ఇలాగే జరిగింది: కేసీఆర్

బీఆర్ఎస్ రాబోయే 15 ఏళ్లు అధికారంలో ఉండబోతుందని కేసీఆర్ అన్నారు. ఎన్టీఆర్ పాలన తర్వాత ఇలానే జరిగిందని మంగళవారం జడ్పీ ఛైర్మన్లతో నిర్వహించిన సమావేశంలో చెప్పారు. పిచ్చి పనులు చేసి ఛీ అనిపించుకోవడం కాంగ్రెస్‌కు అలవాటంటూ ఆసక్తికర వ్యా్ఖ్యలు చేశారు.

New Update
KCR: రాబోయే 15 ఏళ్లు బీఆర్ఎస్‌దే అధికారం.. ఎన్టీఆర్‌కు ఇలాగే జరిగింది: కేసీఆర్

KCR Meeting: రాబోయే 15 ఏళ్లు బీఆర్ఎస్ (BRS) అధికారంలో ఉండబోతుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం బీఆర్ఎస్ జడ్పీ ఛైర్మన్లతో సమావేశం నిర్వహించిన కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ మేరకు కేసీఆర్ మాట్లాడుతూ.. 'మళ్లీ అధికారంలోకి వస్తే 15 ఏళ్లు పాలిస్తాం. ఎన్టీఆర్ పాలన తర్వాత ఇలానే జరిగింది. పిచ్చి పనులు చేసి ఛీ అనిపించుకోవడం కాంగ్రెస్‌కు (Congress) అలవాటు. కరెంటు, తాగునీరు, శాంతి భద్రతల సమస్య చూసి బాధేస్తోందన్నారు. అలాగే తాము అధికారంలోకి వచ్చాక ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాల పేర్లు మార్చకుండా అలానే కొనసాగించామని గుర్తు చేశారు. రాజకీయాల్లో ఉన్న వాళ్లకు సౌజన్యం, గాంభీర్యం ఉండాలని అన్నారు. కాంగ్రెస్ నాయకులు రైతుబంధుకు ఎగనామం పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

ఇక రెండేళ్లలో నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉంది. తెలంగాణలో నియోజకవర్గాలు 160కి పెరిగే అవకాశం ఉంటుంది. మహిళలకు కూడా ఎక్కువ అవకాశాలు వస్తాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడితే మంచి ఫలితాలు ఉంటాయి. పార్టీలో అన్ని స్థాయిల్లో త్వరలోనే కమిటీల ఏర్పాటు చేయాలి. సోషల్‌మీడియాను పటిష్టంగా తయారు చేస్తామంటూ చెప్పుకొచ్చారు.

Also Read: రేవంత్ రెడ్డితో నోకియా జర్మనీ ప్రతినిధి బృందం భేటీ

Advertisment
తాజా కథనాలు