Tamilisai Soundararajan: నా ఫోన్‌లను బీఆర్‌ఎస్ ట్యాప్ చేసింది.. బలమైన ఆధారాలున్నాయి! తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బీఆర్ఎస్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. తాను పదవిలో ఉన్నప్పుడు పోలీసు అధికారులు తన ఫోన్ ట్యాప్ చేశారని చెప్పారు. రాజ్‌భవన్ ఫోన్‌లను కూడా విడిచిపెట్టబడలేదన్నారు. ఇందుకు సంబంధించి బలమైన ఆధారాలున్నాయని తెలిపారు. By srinivas 17 Apr 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Tamilisai: తెలంగాణ రాష్ట్ర మాజీ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ తన ఫోన్‌లను బీఆర్‌ఎస్ ప్రభుత్వం ట్యాప్ చేసిందని చెప్పారు. అంతేకాదు ఇందుకు సంబంధించిన తన దగ్గర బలమైన ఆధారాలున్నాయన్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసిన పోలీసు అధికారుల బృందం అక్రమ ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఆమె సంచలన ఆరోపణలు చేశారు. బలమైన ఆధారాలున్నాయి.. ఈ కేసులో అరెస్ట్ అయిన సీనియర్ పోలీసు అధికారులతో సహా పలువురు తన ఫోన్ ట్యాప్ చేసినట్లు రీసెంట్ ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రత్యేకించి రాజ్‌భవన్ ఫోన్‌లు విడిచిపెట్టబడలేదని అన్నారు. 'నేను గవర్నర్‌గా ఉన్నప్పుడు నా ఫోన్‌లను ట్యాప్ చేశారని చెప్పడానికి బలమైన ఆధారాలున్నాయి. ఈ విషయంపై నేను గతంలో ఏది మాట్లాడినా అది నిజమే. నేడు కూడా అదే నిజం. నవంబర్ 2022లో నా ఫోన్లు ట్యాప్ చేయబడుతున్నాయనే బహిరంగంగా చెప్పాను' అన్నారు. ఇది కూడా చదవండి: Ganja milk shake: మిల్క్ షేక్ ల్లో గంజాయి పౌడర్.. పాలు, హార్లిక్స్, బూస్ట్ లో గుర్తించిన హైదరాబాద్ పోలీసులు! దీంతో తాను రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నానంటూ గత ప్రభుత్వం నా ప్రకటనలను తోసిపుచ్చిందని చెప్పారు. 'అప్పుడే నా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని నాకు బలమైన అనుమానం వచ్చింది' అంటూ ఆసక్తికర విషయాలు బయటపెట్టింది. అలాగే గవర్నర్ కార్యాలయానికి కేటాయించాల్సిన ప్రోటోకాల్‌ను అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం పాటించలేదని డాక్టర్ సౌందరరాజన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. #brs #tamilisai-soundararajan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి