Ganja : దేశవ్యాప్తంగా గంజాయి మత్తు ఊహించని రేంజ్ లో వ్యాపిస్తోంది. గంజాయి స్మగ్లర్స్(Ganja Smugglers) చిన్నా పెద్ద తేడా లేకుండా అందరినీ ఈ మత్తుకు బానిసలుగా మారుస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో విచ్చలవిడిగా చలామణి అవుతోంది. ప్రభుత్వాలు, పోలీసు యంత్రాంగం ఎంతటి నిఘా పెట్టిన వివిధ రూపాల్లో సరాఫరా చేస్తున్నారు కేటుగాళ్లు. ఇటీవలే హైదరాబాద్(Hyderabad) పరిసరాల్లోని పలు స్కూల్లకు దగ్గరలోని కిరాణ షాపుల్లో చాక్లెట్ రూపంలో గంజాయిని విక్రయించి విద్యార్థులను ఆగం చేసిన ఇష్యూ మరవకముందే మరో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది.
పూర్తిగా చదవండి..Ganja Milk Shake : మిల్క్ షేక్ ల్లో గంజాయి పౌడర్.. పాలు, హార్లిక్స్, బూస్ట్ లో గుర్తించిన హైదరాబాద్ పోలీసులు!
హైదరాబాద్ లో మరో గంజాయి ముఠాను పోలీసులు పట్టుకున్నారు. కోల్కతాకు చెందిన కేటుగాళ్లు గంజాయిని పౌడర్ గా మార్చి మిల్క్ షేక్స్, చాక్లెట్స్, స్వీట్స్, పాలు, హార్లిక్స్, బూస్ట్ ల్లో కలిపి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. జగద్గిరిగుట్టలోని జయశ్రీ దుకాణదారు మనోజ్ ను అదుపులోకి తీసుకున్నారు.
Translate this News: